నేను 'గే' అన్న సంగతి నాకే తెలియదు, కానీ అది ముందే పసిగట్టేసిందెలా?

వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాలా నిజం.ఈ మాటలు చెప్పింది స్వయానా ఒక యువతి.

ఎల్లీ హౌస్( Ellie House ) అనే ఒకామె తాను గే( Gay ) అని తెలుసుకోవడానికంటే ముందే నెట్‌ఫ్లిక్స్‌కు ఆ విషయం తెలిసిందని చాలా ఆశ్చర్యపోయింది.ఇదెలా సాధ్యమని ఆమె రీసెర్చ్ చేసింది.

అందులో మతిపోయే విషయాలు వెల్లడయ్యాయి.యూనివర్సిటీలో ఆమె రెండో ఏడాది చదువుతున్నప్పుడు బైసెక్సువల్( Bi Sexual ) అని తెలుసుకుందట.

కానీ, ఒక పెద్ద టెక్నాలజీ సంస్థ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్‌ అంతకంటే ముందే ఈ విషయాన్ని పసిగట్టిందట.వినడానికి చాలా చోద్యంగా వుంది కదూ.

Advertisement

ఆమెకి అంతకు మునుపు బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడట.ఆ సమయంలోనే ఆమె ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్( Netflix ) చూసేదట.ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ ఎక్కువగా ఆమెకి లెస్బియన్ స్టోరీలైన్స్ లేదా బై సెక్సువల్ క్యారెక్టర్స్‌తో రూపొందిన సిరీస్‌లు ఎక్కువగా రికమండేషన్స్‌గా చూపించేదట.

అలా ఆమెకి యూ మీ హర్( You Me Her ) అనే పేరుతో రూపొందిన ఒక షో విపరీతంగా నచ్చేసిందట.అదేవిధంగా సాఫిక్ అనే ప్లేలిస్ట్‌ను స్పాటిఫై కూడా ఆమెకి నెట్‌ఫ్లిక్స్ రికమండ్ చేసిందట.

ఎవరైతే మహిళలు, మహిళలను ఇష్టపడతారో వారికి సాఫిక్ అనే పదాన్ని వాడతారు.కొన్ని నెలల తర్వాత టిక్‌టాక్‌పై బైసెక్సువల్ క్రియేటర్లకు చెందిన వీడియోలు మాత్రమే ఆమె ఫీడ్‌లో కనిపించడం మొదలైందట.

ఆ తర్వాత కొన్ని నెలలకి, ఆమె తనకి తాను బైసెక్సువల్‌ అన్న విషయం తెలుసుకుందట.దాంతో ఆమె తనకి తానుగా గుర్తించని ఈ విషయాన్ని టెక్ ప్లాట్‌ఫామ్‌లు ఎలా గుర్తించాయి? అవి ఏ సంకేతాల ద్వారా నేను బైసెక్సువల్ అని తెలుసుకున్నాయి? అని ఆశ్చర్యపోయింది.ఇతర ప్లాట్‌ఫామ్‌లకు కూడా ఇదే మాదిరి విధానాన్ని అనుసరిస్తాయనే విషయం తెలిసినదే.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

ఇక ఈ విషయంమీద సదరు కంపెనీ స్పందిస్తూ.వయసు లేదా జెండర్ కాకుండా యూజర్లు యాప్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, దేన్నీ ఎక్కువగా చూస్తున్నారు అనే అంశాల ఆధారంగా యూజర్ అభిరుచులను తెలుపుతున్నాయని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు