టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద తలలు అని చెప్పుకోవచ్చు.ఇలాంటి ఆణిముత్యాలను కన్న తండ్రి పేరు కొణిదెల వెంకటరావు.
( Konidela Venkatarao ) ఆయన బతికున్నప్పుడు కానిస్టేబుల్‌గా పనిచేశారు.మంచి స్పోర్ట్స్ బాడీ ఉన్న వెంకటరావు రిటైర్ అయ్యాక మాత్రం ఫిజికల్ యాక్టివిటీని పూర్తిగా తగ్గించేశారట.
ఆయన మరణానికి అదే కారణం అన్నట్లు నాగబాబు( Nagababu ) తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.తన తండ్రికి డయాబెటిస్ కూడా ఉందని తెలిపాడు.
డయాబెటిస్ ఉన్నా సరే తన తండ్రి రిటైర్ అయ్యాక కుర్చీకే పరిమితమయ్యాడని, యాక్టివ్ లైఫ్ స్టైల్ కొనసాగించలేదని అన్నాడు.దానివల్ల అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని తెలిపాడు.
ఒక డయాబెటిస్ తప్ప తన నాన్నకు ఎలాంటి వ్యాధులు లేవని నాగబాబు వెల్లడించాడు.ఉన్న ఆ ఒక్క రోగాన్ని సరిగా మేనేజ్ చేసుకుని ఉంటే ఇంకొంతకాలం తన తండ్రి బతికి ఉండేవాడని చెప్పుకొచ్చాడు.
రిటైర్ అవ్వకముందు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో( Police Department ) ఒక టైగర్ గా పని చేసే వాడిని కూడా తెలిపాడు.తన తండ్రి స్మోక్ కూడా చేసేవాడని, కానీ దానివల్ల అతని ఆరోగ్యానికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తెలిపాడు.
తన తండ్రి చాలా ప్రశాంతంగా చనిపోయాడని, అతని ఆరోగ్యం మెల్లగా క్షీణిస్తున్న సరే ఎలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోలేదని వెల్లడించాడు.
వెంకట్రావు తమను ఎంతో బాగా చూసుకున్నాడని, అలానే కష్టపడి పని చేసే వాడని నాగబాబు తెలిపాడు.ఫ్యామిలీ అంటే తన తండ్రికి చాలా ఇష్టమని, తమకు బాగా ఎమోషనల్‌గా అటాచ్ అయ్యారని వెల్లడించాడు.తన తండ్రి ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా సున్నితంగా ఉంటాడని కానీ పోలీసు డ్యూటీలో ఉన్నప్పుడు చాలా సాహసాలు చేసేవాడని అన్నారు.
ఫైటింగ్ చేయడానికి కూడా వెంకట్రావు అస్సలు వెనకాడే వాడు కాదట.ఆ ధైర్యమే పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) వచ్చినట్లు నాగబాబుని పేర్కొన్నాడు.
తన అన్నయ్య చిరంజీవికి( Chiranjeevi ) తన నాన్న ధైర్యం లో 40% దాకా వచ్చిందని అన్నాడు.తనకు మాత్రం ఆ ధైర్యం అసలు రాలేదని తెలిపాడు.తాను చాలా బ్యాలెన్స్‌డ్ గా ఆలోచించి ముందడుగు వేస్తానని అన్నాడు.కానీ పవన్ కళ్యాణ్ ముందు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తన తండ్రి లాగా ఏదైనా గుడ్డిగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారని వివరించాడు.
నాగబాబు తన తండ్రి వెంకటరావు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.