ఇంటి ఓనర్లు కేంద్రం ఆదేశాలను పట్టించుకుంటారా?

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా వేతన జీవుల జీవితాలు దారుణంగా ఉన్నాయి.

వారికి నిత్యావసరాలు ఇంకా ఇంటి అద్దెలు ఈఎంఐలు ఇలా రకరకాల సమస్యలు కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్నారు.

దాంతో కరోనా విపత్తు నేపథ్యంలో కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.ఇదే సమయంలో అన్ని బ్యాంకులకు చెందిన ఈఎంఐలను కట్టాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెల్సిందే.

ఇదే సమయంలో దేశంలో అద్దెకు ఉంటున్న ఏ ఒక్కరు కూడా రాబోయే రెండు మూడు నెలల వరకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు నెలలు మానవతా దృక్పదంతో ఇంటి ఓనర్‌లు మద్యతరగతి వారి నుండి రెంటు వసూళ్లు చేయడం మానేయాలంటూ కేంద్రం విజ్ఞప్తి చేసింది.

కాని కేంద్రం విజ్ఞప్తిని ఇంటి ఓనర్లు పట్టించుకునేనా అనేది అనుమానమే.అసలు ఇంటి ఓనర్లు ఈ విషయాన్ని పరిగణలోకి కూడా తీసుకునే అవకాశం కనిపించడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

తాజా వార్తలు