వీడియో వైరల్: భారీ వరద.. కుప్పకూలిన ఇల్లు.. ఎక్కడంటే?

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులలా మారిపోయాయి.

అయితే ఢిల్లీలోని వరద బీభత్సానికి స్లమ్ లో ఉండే ఇళ్లు అన్ని కొట్టుకుపోతున్నాయి.

ఇంకా ఈ భారీ వరదల కారణంగా ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.అయితే ఓ మృతదేహం వరద నీటిలో తేలాడుతూ కొట్టుకుపోవడం అందరికి షాక్ కి గురి చేస్తుంది.

ఇది అంత ఒకలా ఉంటె కుండపోతగా కురిసిన భారీ వర్షం కారణంగా అన్నానగర్‌లోని ఐటీవో సమీపంలో ఒక ఇళ్లు వరద తాకిడికి కుప్పకూలిపోయింది.అయితే కుప్పకూలిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement

ఇంకా దీనికి సంబంధించిన వీడియోను పర్వీన్ కశ్యప్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే భారీ వర్షానికి ఆదంపూర్‌, హిస్సార్‌, హన్సి, జింద్‌, గోహానా, గనౌర్‌, బరూత్‌, రోహ్‌తక్‌, సోనిపట్‌, బాగ్‌పాట్‌, గురుగ్రామ్‌, నొయిడా, ఘజియాబాద్‌, ఫరిదాబాద్‌ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

ఇంకా ఈ భారీ వర్షాలకు 100కుపైగా జంతువులు సైతం మరణించాయి.

Advertisement

తాజా వార్తలు