ఎమ్మెల్యే టికెట్ పై ఈ ఎమ్మెల్సీల ఆశలు..! కేసిఆర్ నిర్ణయం ఏంటో ? 

తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం మాత్రమే ఉండడంతో పూర్తిగా ఎన్నికల వ్యూహాలపైనే అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశం పైన ప్రత్యేకంగా దృష్టి సారించాయి.

 Hopes Of These Mlcs On Mla Ticket What Is Kcr's Decision , Telangana Cm Kcr, Br-TeluguStop.com

ఈ మేరకు నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించి వారిని పోటీకి దింపేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్( Telangana CM KCR ) కాస్త ముందంజలోనే ఉన్నారు.

ఇప్పటికే సర్వేలు చేయించిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టు ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చాలామంది కీలక నేతలే ఆశలు పెట్టుకున్నారు.

కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుని టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Brs Mlas, Brs Mlcs, Kadiyam Srihari, Koushik Reddy-Politics

దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ ఎమ్మెల్సీల్లో కేటీఆర్( KTR ) కు సన్నిహితులైన ఎమ్మెల్సీలు ఉండడం విశేషం .ముఖ్యంగా జనగామ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,  శంబిపూర్ రాజు, పల్ల రాజేశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.ఇక మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి , మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారు.అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి( MLC Kasireddy Narayana Reddy ) కల్వకుర్తి టికెట్ పై ఆశలు పెట్టుకోవడమే కాకుండా , టిక్కెట్ తనదేనని అప్పుడే నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అలాగే మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తాండూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

Telugu Brs Mlas, Brs Mlcs, Kadiyam Srihari, Koushik Reddy-Politics

ఇక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి హుజురాబాద్ అసెంబ్లీకి ( Huzurabad Assembly )పోటీ చేయాలనే పట్టుదలతో ఉండగా,  తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు.నాంపల్లి , అంబర్ పేట,  ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి పోటీ చేయాలనే ఆలోచనలు ఆయన ఉన్నారు .ఇక నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసే ప్లాన్ లో ఉన్నారు.వీరే కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ , మన్నే కృశాంక్,  గజ్జల నగేష్,  దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిని వచ్చే ఎన్నికల్లో టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు.అలాగే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశలు పెట్టుకున్నారు.

అయితే వీరిలో కేసీఆర్ ఆశీస్సులు ఎంతమంది పై  ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube