తేనెటీగలు చాలా ప్రమాదకరమైనవి.వీటితో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.
అయితే దురదృష్టవశాత్తు తాజాగా ఒక వ్యక్తి తేనెటీగల కాటుకు గురయ్యాడు.దాంతో అతడి ప్రాణాలే పోయాయి.
ఈ దుర్ఘటన పశ్చిమ బెంగాల్‌లోని నాగేంద్రపూర్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.
గత కొద్ది రోజులుగా సుర్జీత్ కయల్ (32) అనే వ్యక్తి దుర్గాపూజ సెలవుల్లో భాగంగా తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.అయితే గురువారం సాయంత్రం తన తల్లి వంట గదిలో వంట చేస్తుండగా అక్కడ పుట్టిన పొగ అనేది తేనెటీగలను డిస్టర్బ్ చేసింది.
దాంతో తేనెటీగలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.
ఈ సమయంలో తన తల్లిని కాపాడేందుకు సుర్జీత్ పరుగు పరుగున కిచెన్ లోపలికి వచ్చాడు.
తల్లిని కాపాడుతూ అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చాడు.ఈ క్రమంలో అతడిని తేనెటీగలు విపరీతంగా కుట్టేసాయి.
దాంతో అతడు కింద పడిపోయాడు.అనంతరం స్థానికులు బాగా గాయపడిన అతడిని గురువారం రాత్రి రాయడిగి గ్రామీణ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో శుక్రవారం డైమండ్ హార్బర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
సుర్జీత్ తన భార్యతో కలిసి పని నిమిత్తం నదియాలోని తాహెర్‌పూర్‌లో నివసిస్తున్నాడు.సెలవులు కావడంతో తన తల్లిదండ్రులతో కలిసి కొన్ని రోజులు సంతోషంగా గడపాలనుకున్నాడు.కానీ అతని సెలవులు విషాదంతామయ్యాయి.
కన్న కొడుకు చిన్న వయసులోనే చనిపోవడంతో అతని తల్లి కన్నీరు మున్నీరయ్యింది.ఆమెను చూసి స్థానికులు చలించిపోయారు.