క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను అందించే హోమ్ మేడ్ క్రీమ్ ఇదే!

క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసమే ఖ‌రీదైన క్రీమ్స్‌, మాయిశ్చ‌రైజర్స్‌, సీర‌మ్స్‌, ఫేస్ మాస్క్‌ల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ మేడ్ క్రీమ్‌ను వాడితే గ‌నుక మీ ముఖ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ క్లియ‌ర్‌గా, గ్లోయింగ్‌గా మెరుస్తుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ క్రీమ్ ఏంటో.? ఎలా త‌యారు చేసుకోవాలో.? తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా చిన్న సైజ్ కీరా తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అర క‌ట్ట కొత్తిమీర తీసుకుని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.అలాగే గుప్పెడు తుల‌సి ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కీరా ముక్క‌లు, కొత్తిమీర‌, తుల‌సి ఆకులు, అర క‌ప్పు రోజ్ వాట‌ర్ వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.

Advertisement

ఆ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ క‌లిపి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని స్ట‌వ్‌పై పెట్టి స్పూన్‌తో తిప్పుకుంటూ ప‌ది నిమిషాల పాటు ఉడికిస్తే క్రీమ్‌లాగా త‌యారు అవుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఆపై అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్‌, రెండు చుక్క‌లు విట‌మిన్ ఇ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధ‌మైన‌ట్టే.ఒక బాక్స్‌లో ఈ క్రీమ్‌ను ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ప‌ది రోజుల పాటు వాడుకోవ‌చ్చు.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ క్రీమ్‌ను అప్లై చేసి.

ఉద‌యాన్నే నార్మ‌ల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోయి స్కిన్ క్లియ‌ర్ అండ్ గ్లోయింగ్‌గా మారుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు