కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హోంగార్డు ఆత్మహత్యాయత్నం కలకలం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హోంగార్డు ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.సెల్ఫీ వీడియో తీసుకుని హోంగార్డు చెన్నప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రస్తుతం చెన్నప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే నాయకుల ఒత్తిడితో పోలీసులు తన భర్తను వేధించారని బాధితుని భార్య శివనాగమ్మ ఆరోపిస్తుంది.

ఎస్ఐ సునీల్, స్థానిక రాజకీయ నేత వేధింపులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.తన భర్తకు ఏమైనా జరిగితే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తెలిపింది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు