హాకీ 5S ఆసియా కప్ విజేతగా భారత్.. చిత్తుగా ఓడిన పాక్..!

క్రీడ ఏదైనా భారత్-పాకిస్తాన్( India vs Pakistan ) మధ్య పోరంటే క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు.

ఒకవైపు భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే మరొకవైపు భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ తన జోరును కొనసాగించింది.

హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు.( India Hockey Team ) దాయాది జట్టు అయిన పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది.

అద్భుత ఆట ప్రదర్శనతో ఏషియన్ చాంపియన్స్ ట్రోపీ ఫైనల్లో భారత్ 6-4 తేడాతో గెలిచి పాకిస్తాన్ ను( Pakistan ) చిత్తుగా ఓడించింది.

హాకీ మ్యాచ్( Hockey ) ప్రారంభం నుంచి పాక్ జోరు కనబర్చి.ప్రారంభం నుంచే భారత్ పై( India ) పూర్తి ఆధిపత్యం చెలాయించింది.భారత్ కు గట్టి పోటీ ఇవ్వడంతో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం హోరాహోరీగా తలపడ్డారు.

Advertisement

ఫస్టాఫ్ ముగిసేసరికి పాకిస్తాన్ 3-2 తేడాతో ఆధిత్యంలో నిలిచింది.అయితే సెకండ్ హాఫ్ లో భారత ప్లేయర్ మహమ్మద్ రహీం వరుసగా రెండు గోల్స్ కొట్టి స్కోర్లు సమం చేసేశాడు.

మ్యాచ్ నిర్ణిత సమయంలో రెండు జట్లు 4-4 తో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ ఫలితాన్ని షూట్ అవుట్( Shoot Out ) ద్వారా నిర్ణయించారు.షూట్ అవుట్ లో భారత హాకీ జట్టు రెండు గోల్స్ చేసింది.పాకిస్తాన్ హాకీ జట్టు షూట్ అవుట్ లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.

షూట్ అవుట్ లో భారత ప్లేయర్లైన మనిందర్ సింగ్ ఒక గోల్, గుర్జోత్ సింగ్ ఒక గోల్ నమోదు చేశారు.దీంతో భారత హాకీ జట్టు 6-4 ఆధిత్యంలో నిలిచి.

హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు