చెప్పుతో కొడతా ! వెయ్యి కోట్ల ' ప్యాకేజ్ ' పై పవన్ ఆగ్రహం !

పవన్ ప్యాకేజి స్టార్ ! ప్యాకేజీ తీసుకుని టిడిపి( TDP ) కోసం పనిచేస్తున్నాడు ! ఇలా ఎన్నో ఆరోపణలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై వైసీపీ నాయకులు చేయడంపై గతంలోని ఘాటుగా రియాక్ట్ అయ్యారు పవన్.తనపై ప్యాకేజ్ ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

 Hit With A Shoe Pawans Anger On The Thousand Crores Package , Pavan Kalyan, Cm K-TeluguStop.com

పవన్ ఆ విధంగా చెప్పు చూపిస్తూ వైసిపి నాయకులకు వార్నింగ్ ఇవ్వడం పెద్ద సంచలమే రేపింది.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం టిడిపి అనుకూల ఛానల్ అధినేత పేరుతో ప్రచారం అయ్యే ఓ కార్యక్రమంలో పవన్ పై ఎన్నో సంచలన ఆరోపణలు చేశారు.

ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉండేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) 1000 కోట్ల ప్యాకేజీని పవన్ కు ఇచ్చారు అన్నట్లుగా ఆ కథనం ప్రచారం అయింది.దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది.

ఆ విషయంపై పవన్ స్పందించలేదు.కానీ జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు.

Telugu Abn Rk, Ap, Cm Kcr, Janasenani, Package, Pavan Kalyan, Telugudesham-Polit

ఈ ఆరోపణలపై నిన్న మచిలీపట్నంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ స్పందించారు.ప్యాకేజీ అని పిచ్చివాగుడు వాగితే చెప్పుతో కొడతానని మరోసారి పవన్ వార్నింగ్ ఇచ్చారు.తెలంగాణ ముఖ్యమంత్రి నాకు 1000 కోట్లు ఆఫర్ ఇచ్చారట.ఆ వెయ్యి కోట్లు ఎక్కడున్నాయని వెతుక్కుంటున్నాను.పవన్ కళ్యాణ్ కు 1000 కోట్లు కాకుండా పదివేల కోట్లు ఆఫర్ చేసి ఉంటే వినడానికి బాగుండేది 1000 కోట్లతో మిమ్మల్ని కొనగలనా ? డబ్బుతో మీ గుండెల్లో స్థానం సంపాదించుకోగలనా ? భావంతో కదా మీతో ఏకమవుతున్నాను అంటూ పవన్ మాట్లాడారు.డబ్బులు వెయ్యి కోట్లు తీసుకున్నారు .ప్యాకేజీ తీసుకున్నారు అంటే చెప్పు చూపించాను.నా చెప్పు విదేశీ బ్రాండ్ కాదు.

తెనాలిలో మా వెంకటేశ్వరరావు చేసిన లోకల్ చెప్పు.ఇంకోసారి ప్యాకేజీ పేరు ఎత్తితే,  పిచ్చివాగుడు వాగితే గట్టి దెబ్బ తగులుతుంది.

డబ్బుకు నేను ఆశపడే వ్యక్తిని కాదు.డబ్బు సంపాదించి పేదలకు పంచిపెట్టే వాడినే తప్ప డబ్బుకు ఆశపడే వాడిని కాదు అని ఆవేశంగా మాట్లాడారు .

Telugu Abn Rk, Ap, Cm Kcr, Janasenani, Package, Pavan Kalyan, Telugudesham-Polit

ఈ సందర్భంగా తన సినిమాకు వస్తున్న రెమ్యునరేషన్ వివరాలను పవన్ ప్రకటించారు.ప్రస్తుతం చేస్తున్న సినిమాకు 22 రోజులుగా పనిచేస్తున్నానని,  ఒక రోజుకు నేను రెండు కోట్లు తీసుకుంటానని,  20 లేదా 25 రోజులు పని చేస్తే 45 కోట్ల వరకు వస్తుందని పవన్ అన్నారు.ఇది తన యావరేజ్ స్థాయి.మీరు ఇచ్చిన స్థాయి అంటూ పవన్ అన్నారు డబ్బులు అవసరం నాకు ఉందా నేను సంపాదించలేని డబ్బా ? నేను చూడని సుఖాలా అంటూ పవన్ మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube