డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సినిమా హిట్ 2.ఇందులో అడవి శేషు, మీనాక్షి చౌదరి నటీనటులుగా నటించారు.
అంతేకాకుండా కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి , తనికెళ్ల భరణి తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి, ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందించారు.
అయితే ఈ సినిమా గతంలో హిట్ గా విడుదలైన సంగతి తెలిసిందే.అందులో హీరో విశ్వక్ సేన్ నటించగా ఆ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమాకు నిర్మాతగా నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని బాధ్యతలు చేపట్టగా హిట్ 2 కు కూడా ఆయన నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.అయితే వైజాగ్ లో సంజన అనే అమ్మాయి ని దారుణంగా హింసించి చంపేస్తారు.
అయితే ఈ కేసును ఇన్విస్టిగేషన్ చేయటానికి కృష్ణ దేవ్ (అడవి శేష్) రంగంలోకి దిగుతాడు.ఇటువంటివి చాలా చూశాను గంటల్లో హంతకుడిని పట్టేస్తాను అంటూ కృష్ణదేవ్ ఓవర్ కాన్ఫిడెంట్ తో చెబుతాడు.
ఇక కిల్లర్ కి సవాల్ గా మారడంతో అతడి మూమెంట్స్, ప్లాంట్స్ అర్థం కాకుండా ఉంటాయి.ఇక మర్డర్ కి గురైంది సంజన మాత్రమే కాకుండా ఆ బాడికి మరి కొంతమంది అమ్మాయిల శరీర భాగాలతో కూడి ఉండటంతో కృష్ణదేవ్ మైండ్ మొత్తం బ్లాక్ అవుతుంది.
ఇంతకు ఆ కిల్లర్ ఎవరు.ఎందుకు అమ్మాయిలని చంపుతున్నాడు.చివరికి కృష్ణదేవ్ అతనిని ఎలా పట్టుకుంటాడు అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన
: నటి నటుల విషయానికి వస్తే అడవిశేష్ తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.పాత్రకు తగ్గట్టుగా పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఫిదా చేశాడు.ఇక మీనాక్షి చౌదరి కూడా పర్వాలేదు అన్నట్లుగా నటించింది.
టెక్నికల్:
సాంకేతికపరంగా.దర్శకుడు ఈ సినిమాకు మంచి కథను అందించాడు.ఇక సినిమాటోగ్రఫీ పరవాలేదు.ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఇక స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది.
మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమా తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ
: ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు పరిచయం చేశాడు డైరెక్టర్.ఇక ఫస్ట్ ఆఫ్ పక్కకు పెడితే సెకండ్ హాఫ్ లో కథ బాగా సెట్ చేశాడు.రెస్పెన్స్ మాత్రం బాగా చూపించాడు డైరెక్టర్.మధ్యలో వచ్చే ట్విస్టులు మాత్రం బాగా ఆసక్తిగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
అడివి శేష్ నటన, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ కాస్త డల్ గా అనిపించింది.బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు.
బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సిందేంటంటే.థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.ముఖ్యంగా కథ మాత్రం మంచి హైప్ తో దూసుకెళ్లిందని చెప్పవచ్చు.