ఇప్పుడు గత కొన్నాళ్ళనుండి ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్( Eelctric Vehicles ) అని అంటున్నాము కానీ, ఎలక్ట్రిక్ కారు ఆలోచన చాలా కాలం క్రితమే వచ్చిందని మీకు తెలుసా? అవును, మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు దాదాపు 200 సంవత్సరాల క్రితమే తయారు చేశారు.19వ శతాబ్దం ప్రారంభం నుండి ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కొత్త పరికరాలు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందాయి.ఈ నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా 4 చక్రాల వాహనాలపై ఆసక్తి చూపారు.ఈ కాలంలో డీజిల్‌తో నడిచే కార్లు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి.కానీ, 1832లో స్కాటిష్ మెకానిక్ రాబర్ట్ ఆండర్సన్ అప్పటివరకూ ఎవరూ ఊహించని అద్భుతమైన పని చేశాడు.

స్కాట్లాండ్‌లో నివసించే రాబర్ట్ ఆండర్సన్ మొట్ట మొదటిసారిగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్( Electric Four Wheeler ) వాహనాన్ని తయారు చేశాడు.దానికి అతను తన డీజిల్ కారునే వాడుకున్నాడు.ఈ కారులో అతను సింగిల్ ఛార్జ్ బ్యాటరీని ఉపయోగించాడు.
అంటే దాన్ని ఒక్కసారి మాత్రమే ఛార్జ్ చేయవచ్చు.ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ కారు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో దాదాపు 2.5 కిలోమీటర్లు వెళ్ళసాగింది.రాబర్ట్ ఆండర్సన్ నిర్మించిన EV కారు ఆవిష్కరణ అనంతరం సరిగ్గా 20 ఏళ్ల తరువాత ఎట్టకేలకు రీఛార్జిబుల్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కారు( Rechargeable Battery Electric Car ) కూడా సిద్ధమైంది.

అంటే సరిగ్గా 1865లో లెడ్ యాసిడ్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ కారు రోడ్డుపైకి వచ్చింది.దీనిని ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త సాధించాడు.అలా ఈ ఆటో రంగం అభివృద్ధి నాటినుండి నేటికీ అభివృద్ధి చెందుతూనే ఉంది.ఇక 1891లో మొదటి ఎలక్ట్రిక్ కారు అమెరికాలో ఉత్పత్తి చేయబడింది.8 సంవత్సరాల తరువాత థామస్ ఎడిసన్ దీర్ఘకాలం ఉండే నికెల్-ఆల్కలీన్ బ్యాటరీని అభివృద్ధి చేశాడనే విషయం అందరికీ తెలిసినదే.







