ఇండియాలో ఎంట్రీ లెవెల్ ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో అదిరిపోయే కొత్త మోటార్‌సైకిళ్లు విడుదల కానున్నాయి.గ్లోబల్, దేశీయ బ్రాండ్‌లు ఈ బైక్‌లను జూన్ నెలలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
ఈ బైక్స్ హై-పర్ఫామెన్స్, స్టైల్, సరసమైన ధరలతో లభించనున్నాయి.అవేవో ఇప్పుడు చూసేద్దాం.
1.నెక్స్ట్-జెన్ KTM 390 డ్యూక్
పాపులర్ KTM 390 డ్యూక్( KTM 390 Duke ) కొత్త డిజైన్, ఫీచర్లతో అప్‌డేట్‌ను పొందుతోంది.
ఇది ఎక్స్‌టెండెడ్ ఫ్యూయల్ ట్యాంక్, ఒక అల్యూమినియం స్వింగార్మ్, మెరుగైన సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది.ఇంజన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు.
2.యమహా R3, MT-03

యమహా YZF-R3, MT-03తో ప్రీమియం బైక్ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశిస్తోంది.ఈ బైక్‌లలో 320సీసీ ట్విన్-సిలిండర్ ఇంజన్ మంచి పవర్, టార్క్ అందిస్తుంది.YZF-R3 RC 390తో పోటీపడుతుంది.MT-03 డ్యూక్ 390కి ప్రత్యర్థిగా ఉంటుంది.
3.బజాజ్/ట్రయంఫ్ బైక్ బజాజ్

బజాజ్ ఆటో ట్రయంఫ్( Bajaj Triumph ) కలిసి తమ మొదటి బైక్‌ను 2023, జూన్ 27న విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి.ఈ కంపెనీలు స్క్రాంబ్లర్, రోడ్‌స్టర్‌ను పరిచయం చేస్తాయి.దేశీయ, ఇంటర్నేషనల్ మార్కెట్ల కోసం రెండు బైక్‌లను భారతదేశంలో తయారు చేస్తారు.
4.హీరో/HD X 440

హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్‌సన్ X 440, రోడ్‌స్టర్-స్టైల్ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డాయి.అఫీషియల్ ఇమేజ్‌లు ఇప్పటికే ఈ బైక్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.ఈ అప్‌కమింగ్ బైక్ భారతదేశంలోని హార్లే-డేవిడ్సన్ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
5.RE హిమాలయన్ 450/450cc రోడ్‌స్టర్

రాయల్ ఎన్‌ఫీల్డ్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో హిమాలయన్ 450ని విడుదల చేయనుంది.ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ మెరుగైన పనితీరును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.అంతేకాదు ఈ కంపెనీ అదే ఇంజన్‌తో 450cc రోడ్‌స్టర్ కూడా పరిచయం చేయనుంది.
6.ఇతర లాంచ్‌లు
అప్రిలియా RS 440ని పరిచయం చేస్తుంది, ఇది ఎంట్రీ-లెవల్ స్కూటర్లు, హై-ఎండ్ సూపర్‌బైక్‌ల మధ్య అంతరాన్ని పూరించే మోటార్‌సైకిల్.ఇది భారతదేశంలో తయారు అవుతుంది.అయితే దీని ధర రూ.4 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చు.
రూ.4 లక్షల కంటే తక్కువ ధరతో రానున్న ఈ బైక్‌లు భారతదేశంలోని ఎంట్రీ-లెవల్ ప్రీమియం సెగ్మెంట్ ముఖచిత్రాన్ని మార్చేయగలవు.







