వామ్మో ఏంటిది.. గాల్లో ఇతడు చేసిన విన్యాసాలు వేరే లెవెల్!

డేర్ డెవిల్స్ చేసే స్టంట్స్‌ చూస్తేనే వామ్మో అని చాలామంది నోరెళ్లబెడుతుంటారు.ఒక్కోసారి వీరి చేసే అబ్బురపరుస్తాయి.

ముఖ్యంగా వినీల ఆకాశంలో చేసే విన్యాసాలు మనల్ని షాక్ కి గురి చేస్తాయి.తాజాగా ఇప్పటివరకు చేసిన అన్ని విన్యాసాలకు మించిన ఒక విన్యాసాన్ని ఒక వ్యక్తి చేసి అందర్ని నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాడు.

ప్యూబిటీ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ దయచేసి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది దీనికి ఇప్పటికే రెండు లక్షలకు పైగా లైకులు, మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, వింగ్‌సూట్ (wing suit) ధరించిన కొందరు చాలా ఎత్తులో ఉన్న కొండ అంచు పైనుంచి కిందికి దూకారు.

అయితే ఒక వ్యక్తి వింగ్‌సూట్ లో ఉన్న వారికి వేలాడుతూ గాల్లోనే అత్యంత ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు.ఒక వింగ్‌సూట్ ఫ్లైయర్ నుంచి మరొక ఫ్లైయర్ మీదకు మారాడు.

Advertisement

ఇదంతా ఆకాశంలోనే జరిగింది.తన కెమెరాతో ఈ దృశ్యాలను అతను రికార్డ్ చేశాడు.

కిందకి చూస్తే గుండె ఝల్లుమంటుంది.ఎందుకంటే వారు భూమి నుంచి కనీసం ఒక కిలో మీటర్ల ఎత్తులో ఉన్నారు.

ఇతను ఎలాంటి ఆధారాలు లేకుండా అలాంటి ఎత్తులో ఒకరి పై నుంచి మరొకరికి పైకి మారాడు.చివరికి పారాచూట్ ఆన్ చేసి కిందకి ల్యాండ్ అయ్యాడు.

ఈ విన్యాసం చేస్తున్న సమయంలో చిన్న పొరపాటు జరిగినా అతడు శరవేగంగా కిందికి జారిపడి చనిపోవచ్చు.ఈ వీడియోని చూస్తుంటేనే తమకు హడల్ పుడుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

ఇదే సిచువేషన్ లో ఉంటే గాల్లోనే తమ ప్రాణాలు కలిసిపోతాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు