హిందూ మత ప్రచారకులు ఆ రోజుల్లో మాంసం తినవద్దని చెబుతున్నారు, ఎందుకో తెలుసా?

హిందూ మతంకు చెందిన వారు అనేక సాంప్రదాయాలు అంటూ పాటిస్తూ ఉంటారు.

ప్రపంచంలో ఏ మతం వారు పాటించని పద్దతులు సాంప్రదాయాలను హిందువులు పాటిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

హిందూవుల్లో చాలా మంది కొన్ని వారాల్లో మాంసం తినరు.కొందరు మంగళవారం మాంసం ముట్టరు కొందరు గురువారం మరి కొందరు శనివారంలలో మాంసం ముట్టరు.

మరి కొందరు ఇతర రోజుల్లో ఏదో ఒక రోజున మాంసం తినకుండా ఉంటారు.

హిందూవులకు మాత్రమే ఉన్న ఈ నిబందన ఏంటీ ఎక్కడ నుండి వచ్చిందని కొందరు లోతుగా అధ్యయనం చేస్తే అసలు విషయం వెళ్లడి అయ్యింది.హిందూ మత పెద్దలు జంతువులు మరియు వాటి సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వారంలో కొన్ని రోజులు అయినా మాంసం తినకుండా ఉంటే జంతువులు ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉంటుందనే చిన్న కారణంతో ఇలా వారంలో ఏదో ఒక రోజు మాంసంకు దూరంగా ఉండాలని హిందూ మత పెద్దలు భక్తులకు ప్రచారం చేస్తున్నారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హిందూ మత పెద్దలు చెబుతున్న విషయాలు మాత్రం కొందరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జంతువుల సంరక్షణ కోసం ఉపవాసాలు మాంస హారంకు దూరంగా ఉండటం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.అసలు ఎక్కడ హిందూ ధర్మం ఇలా చెప్పిందో వారు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కొందరు వింత వాదన చేస్తూ హిందూ మతంను తప్పుదోవ పట్టించడంతో పాటు హిందువుల మనోభావాలని దెబ్బ తీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కొందరు హిందుత్వ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు