ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్..!

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.20 ఏళ్ల యువతి మృతిపై నిరసనలు మిన్నంటాయి.

స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొన్న కారు ఆమెను సుమారు 12 కిలోమీటర్లు లాక్కెళ్లిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో యువతి మృతిచెందింది.అయితే ఇది ముమ్మాటికి హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో ఆప్ కార్యకర్తలు భారీగా ఎల్జీ కార్యాలయాన్ని ముట్టడించారు.

దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

నిందితులు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు.

Advertisement
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు