వ్యవసాయం( Agriculture )లో కొత్త పంటలను సాగు చేస్తేనే లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.అందుకే చాలామంది రైతులు కొత్త పంటలను సాగు చేయాలి అనుకున్న సరైన అవగాహన లేక ఆసక్తి చూపించలేకపోతున్నారు.
ఈమధ్య కొత్తరకం గులాబీ పూల( Rose flower )కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు ఈ కొత్తరకం గులాబీ పువ్వులను తయారు చేశారు.
ఈ కొత్త గులాబీని ఆర్కాసవి గులాబీ( Arcasavi rose ) అనే పేరుతో పిలుస్తారు.
ఈ కొత్తరకం గులాబీ పూల సాగులో కొన్ని మెళుకువలు పాటిస్తే అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను అర్జించవచ్చు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అగర్మిన గూడెం గ్రామంలో మహమ్మద్ అనే రైతు ఈ కొత్త గులాబీ సాగు చేసి మంచి లాభాన్ని పొందాడు.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 2250 మొక్కలను నాటుకోవచ్చు.మొక్కల మధ్య 2.5 అడుగుల దూరం మొక్కల వరుసల మధ్య 8 అడుగుల దూరం ఉంటే సూర్యరశ్మి గాలి బాగా తగిలి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది.అయితే ఒక గులాబీ మొక్క ఖరీదు సుమారుగా రూ.40 రూపాయలు ఉంటుంది.ఒక ఎకరం పొలంలో నాటే మొక్కలకు సుమారుగా లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

ముందుగా నేలను లోతు దుక్కులు దున్నుకొని పశువుల ఎరువు( Cattle manure ) వేసి కలయదున్ని ఇతర పంటల అవశేషాలు లేకుండా పరిశుభ్రంగా చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మొక్కలను పొలంలో నాటుకోవాలి.నాటిన ఎనిమిది నెలల తర్వాత పువ్వులు పూస్తాయి.
డ్రిప్ విధానం ద్వారా నీటిని అందిస్తే దాదాపుగా కలుపు సమస్య ఉండదు.పైగా నీరు ఆదా అవుతుంది.
పూలను రోజు మార్చి రోజు కోసుకోవచ్చు.ఇలా రోజు మార్చి రోజు కొయడం వల్ల దిగుబడి పెరుగుతుంది.
ఈ పువ్వులు రెండు లేదా మూడు రోజులు ఉంచిన వాటి రెక్కలు రాలిపోకుండా తాజాగానే ఉంటాయి.మిగతా గులాబీ పువ్వులతో పోలిస్తే ఈ గులాబీ పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.







