చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ విచారణలో భాగంగా ఇప్పటికే చంద్రబాబు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు పూర్తయ్యాయి.ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించి ఇరుపక్షాలు కోర్టుకు వీడియోలను సమర్పించాయి.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ తీర్పును చెబుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా ? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.