సోషల్ మీడియాలో పోస్టింగ్ లు  కట్టడి చేయాల్సిందే.. సీబీఐకి హైకోర్టు ఆదేశాలు

న్యాయవ్యవస్థ.న్యాయమూర్తులను.

 High Court Orders Cbi To Ban Postings On Social Media, High Court ,cbi ,ban Post-TeluguStop.com

కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం పోస్టింగ్ లు పెట్టిన వారిని ఎవరిని వదలొద్దు హైకోర్టు సీబీఐ ని ఆదేశించింది.సీబీఐ కేసులు నమోదు చేస్తున్నా.

పోస్టింగ్ లు  వస్తున్నాయని ఇది న్యాయపాలనకు విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేసింది.దీన్ని కట్టడి చేసేందుకు సీబీఐ విస్తృత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

ఇక్కడ వారి సంగతి సరే.విదేశాల్లో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిని విచారించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని సీబీఐని ప్రశ్నించింది.విదేశాల్లో ఉన్న నిందితులను గుర్తించి విచారించేందుకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలని రిజిస్ట్రీని  ఆదేశించింది.ఈ విషయంలో సహకరించాల్సిందిగా‌.ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ లను కోరింది.ఇప్పటివరకు సీఐడీ అధికారులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో తదుపరి చర్యలేవీ లేవని అసహనం వ్యక్తం చేస్తూ ఈ వ్యాజ్యంపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వంలో ధర్మాసనం ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు నిర్వహించాలని సీబీఐని ఆదేశించింది.

ఈ వ్యాజ్యంపై తాజాగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది.

Telugu Abusive Lawyers, Cbiadvocate, Cbi, Advocates-Latest News - Telugu

సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు స్పందిస్తూ.సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన స్థాయి సంఘం నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.ఇక విచారణ జరపటం లో సీబీఐ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించింది.

తదుపరి విచారణ ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ తనపై నమోదు చేసిన కేసు అక్రమమని వెంటనే కొట్టివేయాలని కోరుతూ గుంటూరు చెందిన అవుతు శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తన అరెస్టుతో పాటు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం విచారణ జరిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube