ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

ఈ విచారణలో భాగంగా రాజాసింగ్ తరపు న్యాయవాది రవిచందర్ మరోసారి వాదనలను వినిపించనున్నారు.

నిన్న ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.అయితే, పీడీ యాక్ట్ గురించి తేలితే రాజాసింగ్ కు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడాన్ని అడ్వైజరీ బోర్డు కూడా సమర్థించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నేటి హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు