తెలంగాణ:పోక్సో కేసులో ఆరోపణలు రాగానే అరెస్ట్ చేయాలని,చట్టం ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( PCC Chief Mahesh Kumar Goud )అన్నారు.బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తప్పకుండా అరెస్ట్ చేస్తారని తెలిపారు.బండి సంజయ్ కొడుకు పరారీలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Chief Minister Revanth Reddy )నిఖార్సైన కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకొచ్చారు.బండి సంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం లేదని వెల్లడించారు.
పోక్సో చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.బండి భగీరథ్‌ను తప్పించే అవసరం తమకు లేదన్నారు.
భగీరథ్ విదేశాలకు వెళ్లారని అనుకోవడం లేదన్నారు.మోదీని ప్రధాన మంత్రిగా మాత్రమే చూస్తామని,ప్రధాని మోదీ ఏదో ఇస్తారని అనుకుంటే ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని,కాంగ్రెస్ కంటే బీజేపీలో ఎక్కువ గ్రూపు తగాదాలు ఉన్నాయన్నారు.బండి భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేయదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విజయలక్ష్మికి మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చామని పీసీసీ చీఫ్ తెలిపారు.ఎవరికి వారు తెలంగాణ జాతిపిత అనుకుంటే ఎలా.? జాతిపిత అనే బిరుదు ప్రజలు ఇవ్వాలన్నారు.మాజీ మంత్రి హరీశ్ రావు( Former Minister Harish Rao ) తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారని,కవిత,కేటీఆర్ తర్వాత వచ్చారని తెలిపారు.
తెలంగాణలోనూ సర్ తో అక్రమాలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.ఎవరి ఓటును వాళ్లు కాపాడుకోవాలని సూచించారు.మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితమై వ్యక్తిగత జీవితానికి అలవాటు పడ్డారన్నారు.రాష్ట్రంలో గతం కంటే ఈసారి ఎక్కువగా పంట దిగుబడి వచ్చిందన్నారు.
ధాన్యం కొనుగోలు జరుగుతోందని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీర్చుతూనే అభివృద్ధి చేస్తున్నామన్నారు.
బెంగాల్‌లో బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.







