ఆంధ్రప్రదేశ్:అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లికు చెందిన వెంకటేష్ ( Venkatesh )(30) గుండె పోటుతో మృతి చెందాడు.అయితే వెంకటేష్ కు గుండెనొప్పి రావడంతో అంబులెన్స్ లేక,ఉన్నా రాకపోవడంతో స్నేహితులు బైక్ పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిశీలించిన డాక్టర్లు అప్పటికే వెంకటేష్ మృతి చెందాడని నిర్దారించారు.ఇదిలా ఉంటే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళేందుకు స్నేహితులు ఆటో డ్రైవర్లను అడగా,ఆటోలో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్లు నిరాకరించడంతో మృతదేహాన్ని బైక్ పైనే స్వగ్రామానికి తీసుకెళ్లిన స్నేహితులు.








