హైకోర్టులో రేవంత్ పిటిషన్‌కు చుక్కెదురు.. !

రాజకీయాల్లో మంచివారు ఉంటారు అనుకోవడం భ్రమనే అవుతుంది.ఎవరు ఇక్కడ చెడ్దవారు కాదు.

అలాగని మంచివారు ఎవరు లేరు.కేవలం అవకాశవాదులు మాత్రమే రాజకీయాల్లో ఉంటారని పలు సంఘటనలు నిరూపించాయి.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాలుగు రోజుల క్రితం చార్జీషీట్‌ దాఖలైన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది కాగా ఈ కేసులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడనే అభియోగం ఉంది.

ఈ క్రమంలో రేవంత్ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని, ఎన్నికల సంఘానికి సంబంధించిన విషయం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది ఇకపోతే ఇదే అంశంపై గతంలో రేవంత్ రెడ్డికి చుక్కెదురు అయ్యింది.

Advertisement

తాజాగా మరోసారి పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది అయినా రేవంత్ రెడ్ది అంటే యువతలో మంచి పేరు ఉంది.అలాంటప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుని బాధపడటం అవసరమా అని అనుకుంటున్నారట ఈయన అభిమానులు.

కుటుంబంలో గొడవలు మనోజ్ ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి... వీడియో వైరల్!
Advertisement

తాజా వార్తలు