ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద హై అలర్ట్..!!

తాడేపల్లి లో ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

విషయంలోకి వెళితే ఈరోజు సీఎం జగన్ ఇంటిని ముట్టడించడానికి నిరుద్యోగ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది.

అయితే పోలీసులు నిరసనలకు అనుమతులు లేదని స్పష్టం చేయడంతో పాటు ముందస్తు అరెస్టులు కూడా చేస్తున్నారు.ఈ పరిణామంతో సీఎం ఇంటి వద్ద ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

ముఖ్యమంత్రి నివాసం వద్ద హై అలర్ట్ ప్రకటించి అక్కడ పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.సీఎం నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలలో పోలీసులు సోదాలు చేస్తూ ఉన్నారు.

అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చాక భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉంటుంది అని హామీ ఇచ్చి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సమయంలో తక్కువ ఉద్యోగాల భర్తీకి వైసిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగ సంఘాలు మండిపడ్డాయి.

Advertisement

ఈ నేపథ్యంలో సీఎం ఇంటిని ముట్టడించడానికి నిరుద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.ఈ పరిణామంతో పోలీసులు.అలర్ట్ అయ్యి సిఎం ఇంటి వద్దకు ఎవరూ రాకుండా నిరసనలు చేపట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు