ఫేస్ బుక్ మెసెంజర్ లో ఇలాంటి ఫీచర్లు ఉన్నాయని తెలుసా ?

వాట్సాప్ ని కొనుగోలు చేయకముందు, బిబిఎమ్ కి మంచి డిమాండ్ ఉన్నప్పుడే ఫేస్ బుక్ మెసెంజర్ ని వదిలింది.

తొలుత చాలామంది దీన్ని వ్యతిరేకించినా, మెల్లిమెల్లిగా మెసెంజర్ ఆప్ ని వాడటానికి అలవాటు పడిపోయారు.

అయితే ఫేస్ బుక్ మెసెంజర్ లో కేవలం మెసెజ్, ఫోటోలు పంపడమే కాదు, ఇంకా ఎన్నో చెయొచ్చు.మెసెంజర్ లో దాగున్న ఆ ఫీచర్స్ ని చదివి తెలుసుకోండి.

* చాలామందికి తెలియని విషయమేమిటంటే, ఫేస్ బుక్ మెసెంజర్ నుంచి, 15 సెకన్లు, దానికన్నా తక్కువ నిడివి ఉన్న విడియోలను పంపొచ్చు.* ఫేస్ బుక్ మెసెంజర్ లోకి త్వరలోనే హెల్త్ రిపోర్టులు, వెదర్ రిపోర్టులు తెలుసుకునే సౌలభ్యం త్వరలోనే రానుంది.

* మెసెంజర్ లో బాస్కేట్ బాల్ గేమ్ దాగుందన్న విషయం తెలుసా.బాస్కేట్ బాల్ ఎమోజి సెండ్ చేయడం ద్వారా ఈ గేమ్ ని మొదలుపెట్టొచ్చు.

Advertisement

* మీ స్నేహితులతో ముచ్చట్లు పెడుతూ చాట్ చేసుకోవచ్చు తెలుసా.@fbchess అని టైప్ చేసి, చెస్ కోడ్స్ ద్వారా చెస్ ఆడుకోవచ్చు.

* సాకర్ ఇమోజి పంపడం ద్వారా మీరు ఫుట్ బాల్ కూడా ఆడుకోవచ్చు.* డాలర్ బటన్ నొక్కి, ఆ తరువాత సూచనలు పాటిస్తూ, డబ్బులు పంపుకోవచ్చు.

చెల్లింపులు చేయవచ్చు.* వాట్సాప్ లాగానే చాట్ ని మ్యూట్ లో పెట్టొచ్చు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు