అమీర్ పేటలో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు

హైదరాబాద్ అంటే హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్స్ కి, అలాగే వ్యభిచార ముఠాలకి కొదవే ఉండదు.

పోలీసులు వీటిపై ఎంతగా సీరియస్ యాక్షన్ తీసుకున్న ఈ దందాని కొనసాగిస్తున్న వారు అదే దారిలో వెళ్తున్నారు.

ఇలాంటి భాగోతాలు బయటపడినపుడు మళ్ళీ కొంతకాలం వీటి గురించి చర్చ నడుస్తుంది.ఆ తరువాత ఇలాంటి వ్యభిచార రాకెట్స్ నడిపేవారు మళ్ళీ అదే పంథాలో వెళ్తూ ఉంటారు.

తాజాగా అమీర్ పేట లో ఓ స్టార్ హోటల్ లో హైటెక్ వ్యభిచారం రాకెట్ ని అడ్డుకున్నారు.ప్రముఖ హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించి నలుగురు విదేశీ యువతులతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఈ వ్యభిచార ముఠాకి సహకరించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, హోటల్‌ మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు.అలాగే పంజగుట్టలోని పోలో లాడ్జిపై దాడి చేసి ఉజకిస్తాన్‌కు చెందిన నలుగురు మహిళలతో పాటు బెంగాల్‌కు చెందిన యువతి, నలుగురు విటులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

పోలీసుల రాకపై సమాచారం అందడంతో నిర్వాహకులు పరారైనట్లు తెలిపారు.మొత్తానికి ఈ రెండు సంఘటనలతో హైదరాబాద్ కేంద్రంగా భారీగా వ్యభిచారం ముఠాలు నడుస్తున్నాయని స్పష్టం అవుతుంది.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు