చెన్నకేశవ రెడ్డి సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్స్ వీళ్ళే !

దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం దర్శకుడు వి వి వినాయక్ మరియు బాలయ్య బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం చెన్నకేశవ రెడ్డి.

తాను తీసిన తొలి సినిమా అయిన ఆది చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు వినాయక్.

ఈ చిత్రం లో తారక్ హీరో గా నటించగా తీసిన మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ మొత్తం అయన వైపు చూసేలా చేసుకున్నాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.ఇక ఆది సినిమా విజయాన్ని చుసిన బాలయ్యకు అతడి దర్శకత్వంలో నటించాలనే ఇంట్రెస్ట్ పుట్టింది.

దాంతో మొదట వి సముద్ర దర్శకత్వంలో సినిమా తీయాలనుకున్నప్పటికీ అది పక్కకు పెట్టి మరి ఆది కి అవకాశం ఇచ్చాడు.ఇలాంటి పరిణామాల క్రమం లో చెన్నకేశవ రెడ్డి సినిమా రూపుదిద్దుకుంది.

ఇక ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించగా, బెల్లం కొండ సురేష్ నిర్మాత గా వ్యవహరించారు.ఇక పరుచూరి రైటర్స్ అందించిన పవర్ ఫుల్ డైలాగ్స్ తో బాలయ్య బాబు డ్యూయెల్ రోల్ లో తన నట విశ్వరూపం చూపించారు.

Advertisement

ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా శ్రియ మరియు సీనియర్ హీరోయిన్ టబు నటించారు.అంతే కాదు బాలయ్య బాబు చెల్లి పాత్ర లో మరొక హీరోయిన్ దేవయాని కూడా నటించింది.

ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండటం తో సినిమా విడుదల కు ముందే భారీగా అంచనాలు పెరిగిపోయాయి.అయితే తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించమని కొంత మంది హీరోయిన్స్ ని వినాయక్ అడిగిన కూడా ఒకే చెప్పలేదట.అందులో ముఖ్యంగా దేవయాని పాత్ర కోసం తొలుత హీరోయిన్ లయని సంప్రదించారట.

రామోజీ ఫిలిం సిటీ లో ఒక షూటింగ్ లో ఉన్న లయ ను వెళ్లి బాలయ్యకు సోదరి పాత్ర కోసం అడిగితే ఆమె గుక్క పెట్టి ఏడ్చిందట.

తెలుగు హీరోయిన్స్ అంటే మన తెలుగు దర్శకులకు ఎందుకు ఇంత చులకన , మేము హీరోయిన్స్ గా పనికి రామా ? చెల్లి పాత్రలతో సరిపెట్టేస్తారా అంటూ వినాయక్ పై ఒకింత ఫైర్ అయ్యిందట.దాంతో లయ కు సారి చెప్పి వినాయక్ అక్కడ నుంచి వెళ్లిపోయారట.ఇక సీనియర్ నటి టబు నటించిన పాత్ర కోసం సౌందర్య ని సంప్రదించట వినాయక్.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కానీ తన కన్నా పెద్ద హీరోకు తల్లిగా చేస్తే ఆ తర్వాత అన్ని అలంటి తల్లి పాత్రలే వస్తాయని సౌందర్య చేయనని చెప్పారట.ఇలా ఈ ఇద్దరు హీరోయిన్స్ సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు