ఫొటోటాక్ : సీనియర్ హీరోయిన్ లో ఎంత మార్పు నోరు వెళ్లబెట్టాల్సిందే

తెలుగు లో తొలి వలపు సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ స్నేహ.ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు తెలుగు మరియు తమిళ ఇతర భాషల ఇండస్ట్రీలో హీరోయిన్ గా కంటిన్యూ అయ్యింది.

 Heroine Sneha New Look Goes Viral, Sneha, Tollywood ,  Sneha New Look,kollywood-TeluguStop.com

టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ లో దాదాపుగా పుష్కర కాలం పాటు హీరోయిన్ గా అది కాకుండా స్టార్‌ హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్మ స్నేహ ప్రస్తుతం నెట్టింట తన కొత్త ఫొటోలతో వైరల్‌ అవుతోంది.హీరోయిన్ స్నేహా పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత సినిమా లకు బ్రేక్ ఇచ్చింది.

అయితే సినిమా ల్లో ఆమె ఎంట్రీని అభిమానులు కోరుకున్నారు.అంతా కోరుకున్నట్లుగానే ఆమెకు ఛాన్స్ దక్కింది.

సీనియర్‌ హీరోయిన్‌ అయిన స్నేహా కు మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో స్నేహ షేర్‌ చేసిన ఈ ఫొటోలను చూస్తుంటే ఈమెకు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కాకుండా రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌ గా కూడా అవకాశాలు ఇవ్వవచ్చు అంటున్నారు.

ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు.మూడు పదుల వయసు లో ఉన్న ఈ హీరోయిన్ తరహాలో ఆకట్టుకునే విధంగా ఉంది.కనుక ఈ అమ్మడిని ముందు ముందు సీనియర్‌ హీరోలు ఎవరైనా హీరోయిన్ గా తీసుకుని నటిస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈమె కొత్త ఫొటోలు మరియు కొత్త లుక్ ను చూస్తుంటే జనాలు నోరు వెళ్ల బెడుతున్నారు.కొందరు అయితే ఈమె ఎవరు అన్నట్లుగా కొన్ని సెకన్లు అలా చూసి ఆ తర్వాత ఓహో ఈమె స్నేహా అన్నట్లుగా గుర్తిస్తున్నారు.స్నేహా ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముందు ముందు ఆమె ఆఫర్ల విషయంలో కొత్త ప్రకటన వింటామని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కనుక ఏం జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Heroine Sneha New Look Goes Viral, Sneha, Tollywood , Sneha New Look,kollywood - Telugu Sneha, Kollywood, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube