కాస్టింగ్ కౌచ్ సంఘటనలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ప్రజలలో ఓ రకమైన చెడు అభిప్రాయం వెళ్లిపోయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు, నిర్మాతలని హీరోయిన్స్ ని లైంగికగా వేధించడంతో పాటు అవకాశాల పేరుతో వాడుకుంటారని, అలాగే సౌత్ సినిమాలకి నటన కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత తెలుగులో నటించిన బాలీవుడ్ భామలతో పాటు, ఇతర భాష హీరోయిన్స్ కూడా కామెంట్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.
సౌత్ ఇండస్ట్రీలో పేరుకుపోయిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాత్రం ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇప్పటికీ ఏదో మూల హీరోయిన్స్ తమకి జరిగిన అనుభవాల గురించి చెబుతూనే ఉన్నారు.
అవకాశం పేరుతో అమ్మాయిలను వంచిస్తూనే ఉన్నారు.ఇప్పుడు మరో హీరోయిన్ కూడా బయటికి వచ్చి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి మీడియా ముందు ధైర్యంగా చెప్పింది.
మరాఠీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న శృతి మరాఠే గతంలో ఓ తెలుగు సినిమాలో నటించింది.

అప్పుడు తాను నటించిన సినిమాలో దర్శకుడు తనతో బికినీ వేయించాడని, అయితే ఆ సీన్ కారణంగా అందరూ తనని నీచంగా చూడటం మొదలెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.అలాగే ఓ బడా నిర్మాత తనని ఆడిషన్ కోసం పిలిచి హీరోయిన్ గా అవకాశం ఇస్తే తనకేంటి అని నేరుగా అడగడం తనని షాక్ కి గురి చేసిందని చెప్పుకొచ్చింది.తెలుగులో సినిమా అవకాశం రావాలంటే కచ్చితంగా నిర్మాతలతో పడక సుఖ పంచుకోవాల్సిందే అని చెప్పుకొచ్చింది.