వాళ్ల వల్లే మద్యానికి బానిసయ్యానని చెప్పిన శృతి హాసన్.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

టాలీవుడ్, కోలీవుడ్ ( Tollywood, Kollywood )ఇండస్ట్రీలలో శృతి హాసన్ కు నటిగా మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

ఈ హీరోయిన్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.

భిన్నమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్న శృతి హాసన్ ( Shruti Haasan )భవిష్యత్తు సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ హీరోయిన్ తాజగా తన అలవాట్ల గురించి చెప్పి ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.

తాను మద్యానికి బానిస కావడం వెనుక అసలు కారణాన్ని ఆమె వెల్లడించారు.ఒక ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

దేవుడంటే నాకు భక్తి అని తాను దేవుడిని నమ్ముతానని అయితే నాన్న గుడికి వెళ్లనిచ్చేవారు కాదు కాబట్టి నేను గుడికి వెళ్లలేదని ఆమె కామెంట్లు చేశారు.నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో పేరెంట్స్ విడిపోయారని ఆమె అన్నారు.

Advertisement

నా పేరెంట్స్ విడిపోవడం నన్ను ఎంతో బాధ పెట్టిందని శృతి హాసన్ వెల్లడించారు.ఆ సమయంలో తాను మద్యానికి బానిసయ్యానని చెప్పుకొచ్చారు.వాళ్ల విడాకులు( Divorce ) నన్ను ఎంతగానో బాధపెట్టాయని ఆమె తెలిపారు.

గతేడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో శృతి హాసన్ రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు.శృతి హాసన్ తర్వాత సినిమాలపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

శృతి హాసన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.శృతి హాసన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.

రాబోయే రోజుల్లో శృతి హాసన్ మరిన్ని సినిమాలకు ఓకే చెప్పి భారీ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.శృతి హాసన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

ఆ నటుడి టాలెంట్ చూసి గోల్డ్ కాయిన్ ఇచ్చేసిన సూర్య.. గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు