Shivani Rajashekar : ఆ ఒక్క సినిమాతో తానేంటో చూపించిన శివాని.. క్యూ కడుతున్న ఆఫర్స్

హీరో మరియు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నటీనటులు మరియు భార్యా భర్తలు అయిన జీవిత రాజశేఖర్( Jeevitha ) ల కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో కి వచ్చేసారు.శివాని మరియు శివాత్మిక ఇద్దరు కూడా మెడిసిన్ ఓ పక్క చేస్తూనే మరో పక్క హీరోయిన్స్ గా తమను తాము తీర్చి దిద్దుకుంటున్నారు.

అయితే ఇందులో శివాని గురించి కాస్త కొత్తగానే మాట్లాడుకోవాలి.ఎందుకంటే ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేయాలని అనుకోవడం లేదు అమే.హద్దులు దాటాలని కూడా ప్రయత్నించడం లేదు.ఆచితూచి అడుగులు వేస్తూ తనకంటూ సరికొత్త ట్రాక్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది శివాని.

తాజాగా కోట బొమ్మాలి పిఎస్ సినిమా విజయవంతం కావడంతో మరోమారు శివాని గురించి టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకుంటున్నారు.

పెళ్లి సందడి సీక్వెల్ సినిమాతో తొలిసారిగా 2021లో శివాని( Shivani Rajashekar ) సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత అద్భుతం అనే సినిమా( Adbhutham )తో తొలిసారి హీరోయిన్ గా పరిచయం అయింది.అప్పటి నుంచి ఆమెలో ఒక నటి ఉందన్న విషయం టాలీవుడ్ గుర్తించింది.

Advertisement

కానీ ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.ఆ సినిమా తర్వాత WWW అనే మరొక సినిమాలో నటించిన కూడా తెలుగు వారు పెద్దగా గుర్తించలేదు.

కానీ ఆమెను తమిళం వారు బాగానే స్వీకరించారు.ఆడది ఒక తమిళ సినిమాలో నటించింది ఇక 2022 సంవత్సరానికి ఒక తమిళ సినిమాతో పాటు శేఖర్ అనే మరో చిత్రంలో కూడా నటించింది.

ఈ సినిమాలో రాజశేఖర్ కి కూతురు పాత్రలో ఆమె కనిపించింది.

ఇక 2023 సంవత్సరానికి వచ్చేసరికి ఆమె నటించడం ఏకైక చిత్రం కోట బొమ్మాలి( Kota Bommali PS ).ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది.సరైన తారాగణం లేకపోయినా సరే కథలో ఉన్న కంటెంట్ కారణంగా జనాలు థియేటర్ కి వెళ్లి ఆ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఈ సినిమాలో తల్లిని చూసుకుంటూ ఓ పక్క ఉద్యోగాన్ని చేసుకునే మహిళగా ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది కంటెంట్ ఉన్న ఈ సినిమా ఆమెకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తోంది శివాని.ఈ సినిమా పూర్తయ్యలోపు ఖచ్చితంగా మంచి అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెతుక్కుంటూ వస్తాయని అందరూ ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు