సరిత ( Heroine Saritha ) సినిమా ఇండస్ట్రీ కి పెళ్ళైన తర్వాత ఎంట్రీ ఇచ్చింది.ఆమె మొదటి పెళ్లి మరియు విడాకులు అప్పట్లో పెద్ద సంచలనం.
ఇక అసలు విషయం ఏమిటి అంటే అప్పట్లో కమల్ హాసన్, హలం హీరో హీరోయిన్ గా నటించిన మన్మధలీల ( Manmadhaleela ) అనే సినిమా విడుదల అయ్యింది.అప్పటికే సరిత తప్పుతాలంగళ్ అనే ఓకే తమిళ్ సినిమాలో నటించింది.
దాంతో సినిమా దర్శకుడు బాల చందర్( Director Balachander ) సరిత ను మన్మధలీల సినిమా చూడటానికి రమ్మని ఆహ్యానించడం తో విజయవాడ లోని ఒక థియేటర్ కి వచ్చింది.అయితే సరిత వయసు అప్పటికి ఒక పద్నాలుగు లేదా పదిహేను ఉంటాయి.
కానీ మన్మధలీల సినిమా కి ఏ సర్టిఫికెట్ వచ్చిన కారణంగా చిన్న పిల్లలను రూల్స్ ప్రకారం అనుమతి చేయకూడదు.సరిత టికెట్ ఇమ్మని అడిగితే అక్కడ టికెట్ కౌంటర్ లో కూర్చున్న క్లర్క్ చిన్న పిల్లలకు ఈ సినిమా చూడటానికి పర్మిషన్ లేదు అని చెప్పి పంపించేశాడు.దాంతో సరిత కు కోపం వచ్చి థియేటర్ లోపలికి వెళ్లి ఆమె పలుకుబడి చూపించి తనకు ఇప్పుడు టికెట్ ఇస్తావా అంటూ పొగరుగా మాట్లాడింది.కానీ ఆ క్లర్క్ మొదట్లో కాస్త కంగారు పడిన తర్వాత తేరుకొని ఇప్పుడు కూడా ఈ సినిమా చూడటానికి నీకు పర్మిషన్ లేదు కానీ నువ్వు హీరోయిన్ కాబట్టి చూస్తా అంటే చూడు అంటూ ఆమె పొగరుకు సరైన సమాధానం ఇచ్చాడు.
దాంతో ఒక ప్రెస్ మీట్ లో సరిత మాట్లాడుతూ ఒక మంచి సినిమాలో కొన్ని యువతకు ఆకర్షించే సన్నివేశాలు పెట్టడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపొయింది.కానీ దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆ క్లర్క్ చెప్పిన మాటలను చెప్పి అక్కడ ఉన్న వారికి షాక్ తినిపించింది.కథకు సంబంధం లేకపోయినా డబ్బుల కోసం దర్శక నిర్మాతలు ఈ మూఢనమ్మకాన్ని పాటిస్తున్నారని కడిగేసింది.ఆ రోజు అదే వేదిక పై ఉన్న విజయబాపినీడు కి ఆమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అందరు అనుకున్నారు కానీ మనసులో ఏది ఉంటే అది మాట్లాడే సరిత ఏ ఒక్కరిని ఉద్దేశించి అలంటి వ్యాఖ్యలు చేయలేదు అని తర్వాత రోజల్లో అందరికి అర్ధం అయ్యింది.