వైసీపీ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.మాదిగలకు అన్ని విధాలుగా అండగా ఉన్న పార్టీ టీడీపీ అని తెలిపారు.
ఏపీలో ఉన్న అవినీతి ఇంకెక్కడా లేదని నడ్డానే విమర్శించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.వైసీపీ ప్రభుత్వం దోపిడీని అమిత్ షా బహిర్గతం చేశారని చెప్పారు.
బీజేపీ అగ్రనేతల ఆరోపణలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.