నాచురల్ స్టార్ గా ప్రస్తుత జనరేషన్లో పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ( Sai pallavi ) తన అభినయంతో మరీ ముఖ్యంగా ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ గా పేరుగాంచింది.ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

మరీ ముఖ్యంగా ఎక్స్పోజింగ్ చేయకుండా,గ్లామర్స్ పాత్రల్లో( Glamor Roles ) నటించకుండా,మేకప్ వేయకుండా నటించే నటీమణులు ఈరోజుల్లో ఎవరుంటారు చెప్పండి.అలాంటి నటిమణి కేవలం సాయి పల్లవి మాత్రమే.అయితే సాయి పల్లవికి ఒక సిస్టర్ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే.అప్పుడప్పుడు ఆమె తన సిస్టర్ తో కలిసి ఫొటోస్ పెడుతుంది.
అంతే కాదు సాయి పల్లవి సిస్టర్ కూడా సాయి పల్లవి లాగే అందంగా ఉంటుంది.అయితే సాయి పల్లవి సిస్టర్ పేరు పూజ కన్నన్ ( Pooja kannan ).
ఈమె కూడా తమిళ సినిమాల్లో నటించింది.అయితే ఈమె నటనకు మంచి మార్కులు పడడంతో ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయట.
అయితే మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు మరి అవకాశాలు వస్తే ఎందుకు ఉపయోగించుకోలేదు అని.

దానికి ప్రధాన కారణం పూజ కన్నన్ ని ఓ తమిళ హీరో( Tamil Hero ) చాలా దారుణంగా అవమానించారట.అంతేకాదు ఆమె నెంబర్ ఎలాగోలా తీసుకొని అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ టార్చర్ చేశాడట.అయితే ఈ విషయం బయట ఎక్కడ చెప్పుకోకుండా పూజ కన్నన్ లోలోపల చాలా బాధపడిందట.
అయితే చెల్లి ఎందుకు అలా ఉంటుందో అర్థం కాక అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని సాయి పల్లవి ప్రయత్నించగా పూజ కన్నన్ ని ఓ హీరో ఇబ్బంది పెడుతున్నాడు అనే సంగతి తెలిసిందట.
అయితే ఆ హీరో ఓ రోజు షూటింగ్లో ఉండగానే చిత్ర యూనిట్ అందరూ అక్కడే ఉన్నా కూడా భయపడకుండా సాయి పల్లవి ఆ హీరో దగ్గరికి వెళ్లి నా చెల్లికి అలాంటి మెసేజ్ లు పెట్టి దాన్ని టార్చర్ చేస్తావా అంటూ చెప్పు తీసుకొని కొట్టిందట.
ఇక ఆ హీరో అవమానంతో షూటింగ్ నుండి వెళ్లిపోయాడట.