టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు.కాగా ఈ ఏడాది ఆరంభంలో సంక్రాతి పండుగకు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా భగవంత్ కేసరి సినిమాలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

అనిల్ రావిపూడి( Anil ravipudi ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తికాగా త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ఓ అనధికారిక రీమేక్ అనేది ప్రస్తుతం నడుస్తున్న రూమర్.19 ఏళ్ల కిందట స్వామి అనే సినిమా వచ్చింది.హరికృష్ణ అందులో హీరో.
ఆ సినిమా స్ఫూర్తితోనే భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి.ఇలా పుకార్లు వచ్చిన వెంటనే యూనిట్ స్పందించింది.

తమది స్ట్రయిట్ మూవీ అని క్లారిటీ ఇచ్చింది.అసలే రీమేక్ ప్రాజెక్టులపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న రోజులివి.భోళాశంకర్ సినిమాతో ఈ నిరసన మరింత ఎత్తుకు చేరింది.ఇలాంటి సమయంలో భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) కూడా రీమేక్ అనే ప్రచారం మొదలయ్యేసరికి నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.
నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో కుదుటపడ్డారు.ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బాలయ్య బాబు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.