Nayanthara : యోగి సినిమా సమయంలో నయనతార లైంగిక వేధింపులకు గురైందా… వెలుగులోకి షాకింగ్ విషయాలు!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నయనతార ( Nayanthara) ఒకరు ఈమె దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

అయితే కెరియర్ మొదట్లో నయనతార తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారి.

పలువురు హీరోలతో ఈమె ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పుకోవడం వంటి విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు.

ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ను ప్రేమించి ఆయనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరికీ కూడా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలు జన్మించారు ప్రస్తుతం పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే నయనతార మరోవైపు సినిమాలలో కూడా ఎంత బిజీగా ఉన్నారు.తాజాగా నయనతార షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార ఈ సక్సెస్ వెనుక ఎన్నో అవమానాలు ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పాలి కెరియర్ మొదట్లో ఎంతో మంది ఈమెను లైంగిక వేధింపులకు గురి చేశారని తెలుస్తోంది.

Advertisement

అందరిలాగే నయనతార కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా నయనతారకు సంబంధించినటువంటి మరో వార్త వెలుగులోకి వచ్చింది.

నయనతార ఒకప్పుడు సినిమా ప్రమోషన్లకు హాజరయ్యే వారు కానీ ఈ మధ్యకాలంలో ఈమె సినిమా ప్రమోషన్లకు మాత్రం దూరంగా ఉంటున్నారు.

ఈ విధంగా నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.నయనతార ప్రభాస్ ( Prabhas ) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం యోగి( Yogi ) ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ సంపాదించుకోలేకపోయింది అయితే ఈ సినిమా సమయంలో నయనతార పెద్ద ఎత్తున లైంగిక వేధింపులకు గురయ్యారని తెలుస్తోంది.ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకలో భాగంగా ఓ రాజకీయ నాయకుడు నయనతారను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురి చేశారట.

ఆ సమయంలో నయనతార ఎంతో బాధపడి ఒంటరిగా ఈ విషయాన్ని తలుచుకొని బాగా ఏడ్చారట.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా హీరోయిన్ల పట్ల లైంగిక వేధింపులకు గురి చేయడం తనని ఎంతగానో ఇబ్బందులకు గురిచేసిందని అందుకే అప్పటినుంచి నయనతార ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది అందుకే ఈమె ఇప్పటికీ ఏ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు( Movie Promotions ) కూడా హాజరు కారు కేవలం సినిమాలో నటించడం వరకు మాత్రమే నయనతార పని సినిమా ప్రమోషన్ల బాధ్యత మాత్రం చిత్ర బృందానిదే.ఈమె ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా కానీ ప్రమోషన్లకు మాత్రం దూరంగా ఉంటారు.

Advertisement

తాజా వార్తలు