ఒకప్పటి సీనియర్ హీరోయిన్ లయ( Laya ) గురించి మనందరికీ తెలిసిందే.స్వయంవరం సినిమాకు( Swayamvaram ) సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.అంతేకాకుండా నాలుగు ఐదు సార్లు ఈమె నంది అవార్డులను( Nandi Awards ) సైతం అందుకుంది.
అలా సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా 13 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.అప్పట్లో టాప్ హీరోలందరి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అప్పట్లో ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లోనే నటించింది.కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనందరికి తెలిసిందే.ఇక ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో సెటిల్ అయిన విషయం తెలిసిందే.అయితే పెళ్లయినంతవరకు సినిమాలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన లయ సినిమాల తరువాత కూడా ఖాళీగా ఉండకుండా జాబ్ చేస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే లయ సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా లయ తాను పనిచేస్తున్న కంపెనీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అమెరికాలో లయ జోబి ఏవియేషన్ ఏరో స్పేస్ కంపెనీలో ఐటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం ఐటీ ఇంజనీర్ గా జాబ్ చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.ఐటీ ఇంజనీర్ గా కూడా భారీగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఈమె అమెరికాలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటుంది.మొన్నటికీ మొన్న హీరోయిన్ లయ ఆమె కూతురు ఇద్దరి కలిసి డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
లయ కూతురు కూడా అచ్చం లయ మాదిరిగానే ఎంతో చూడచక్కగా ఎంతో అందంగా ఉంది.