టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గురించి అందరికి పరిచయమే.తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇక అక్కడి నుంచే సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా లావణ్య త్రిపాఠి ఎంతో బిజీగా ఉంటుంది.
తొలిసారిగా 2008లో అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో తను కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక పలు సినిమాలలో మంచి సక్సెస్ లు అందుకోగా కొన్ని సినిమాలలో ఫ్లాపులు కూడా ఎదుర్కొంది.
అంతే కాకుండా హిందీలో, తమిళ భాషల్లో కూడా పలు సినిమాలలో నటించింది.
అక్కడ కూడా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.ఎక్కువగా టాలీవుడ్ సినిమాలతోనే మంచి బంధం ఏర్పరచుకుంది లావణ్య.
చాలా వరకు స్టార్ హీరోల సరసన కూడా నటించింది.దీంతో తనకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.
కానీ ఆ మధ్య పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు లావణ్యను నిరాశపరిచాయి.అయినా కూడా అవకాశాలు అందుకుంటూనే ఉంది.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది.తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరిమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తుంది.ఫోటో షూట్ లను చేయించుకుంటూ గ్లామర్ ఫోటోలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటుంది.
ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.వారితో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది.ఇక వాటికి తన స్టైల్లో సమాధానమిస్తుంది.ఇటీవలే ఓ విషయంలో నెటిజన్ల పై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.
అందులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ తో ఉన్న ఫోటో ఉండగా.అందులో ఓ విషయాన్ని బయట పెట్టింది.తనకు వెన్నెల కిషోర్ తో షూటింగ్ లో గడపటం ఇష్టమని.ఎందుకంటే ఫ్రీ ఫుడ్ దొరుకుతుంది అన్నట్లుగా తెలిపింది.దీంతో అతడితో తనకు అలా గడపడం ఇష్టమే అని చెప్పకనే చెప్పింది లావణ్య త్రిపాఠి.ఇక ప్రస్తుతం లావణ్య పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.