Kajal Agarwal : మరోసారి ఆ సీనియర్ స్టార్ హీరో కి నో చెప్పిన టాలీవుడ్ చందమామ

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అయ్యి ఒక బిడ్డ కు తల్లి అయిన తర్వాత కూడా సినిమాల్లో వరసగా ఆఫర్స్ దక్కించుకునే అంత అందంగా ఉంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన తర్వాత కూడా రెండు మూడు సినిమాలకు కమిట్ అయింది.

 Heroine Kajal Agarwal Again Sad No To Tollywood Star Hero,kajal Agarwal,senior H-TeluguStop.com

ప్రస్తుతం ఆమె యూనివర్సిల్ స్టార్ కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వచ్చే ఏడాది ఆరంభం లో పూర్తి కాబోతున్నాయి.

కాజల్ అగర్వాల్ ఆ వెంటనే తమిళ్ మరియు హిందీ తో పాటు తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు కథలు వింటున్నట్లుగా సమాచారం అందుతుంది.

Telugu Indian, Kajal Agarwal, Kajal, Kamal Haasan, Senior, Telugu, Top Telugu-Mo

ఇటీవల తెలుగు సీనియర్ స్టార్ హీరో కి జోడి గా ఈమె ను హీరోయిన్ గా నటించాల్సిందిగా అడిగారట.కానీ ఆయనకు జోడి గా నటించేందుకు కాజల్ అగర్వాల్ నో చెప్పిందని వార్తలు జోరుగా వస్తున్నాయి.గతం లో కూడా కాజల్ అగర్వాల్ ఆ సీనియర్ హీరో కి నో చెప్పిందని ప్రచారం జరిగింది.

ఆ సమయం లో కాజల్ అగర్వాల్ పెద్ద గా స్పందించ లేదు.కానీ ఈ సారి ఆ సీనియర్ హీరో కి నో చెప్పడం తో ఇండస్ట్రీలోని ఆయన సన్నిహితులు కాజల్ అగర్వాల్ పై అసంతృప్తి తో ఉన్నారు.

ఆమె కు తెలుగు లో ఇతర హీరో ల సినిమాల్లో కూడా ఛాన్స్ రాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పుకార్లు చేస్తున్నాయి.ఈ విషయమై ఆమె సన్నిహితులు మరియు పిఆర్ టీం మీడియా కు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.

అసలు ఆ సినిమా ఆఫర్ కాజల్ అగర్వాల్ కి వచ్చిందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు.కానీ సోషల్ మీడియా లో మాత్రం రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube