Samantha Yashoda : హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న సమంత ఇప్పుడు కోర్టుల చుట్టూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.ఆమె త్వరలోనే తాను కోలుకుంటానని.

 Samantha Yashoda Film Legal Troubles ,samantha,yashoda,shakunthalam,legal Troub-TeluguStop.com

మళ్లీ సినిమా లు చేసి ప్రేక్షకులను అలరిస్తాను అనే నమ్మకం తో చికిత్స పొందుతున్నాను అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే.ఆ మధ్య యశోద సినిమా డబ్బింగ్ కార్యక్రమాల కోసం మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూ కోసం వైద్యులను పక్కన పెట్టుకొని మరి ఆమె వచ్చింది.

డబ్బింగ్‌ చెప్పే సమయంలో ఆమె చాలా బాధ పడింది అనే ప్రచారం జరిగింది.దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డబ్బింగ్ చెప్తున్న సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడ్డట్లుగా కూడా ఒకానొక సమయంలో యశోద సినిమా యొక్క నిర్మాత తెలియజేశాడు.అలా సమంత అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సమయం లో యశోద సినిమా వల్ల ఆమె కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ మధ్య కాలం లో యశోద సినిమా యొక్క వివాదం నడుస్తోంది.

Telugu Gunasekhar, Troubles, Myositis, Samantha, Shakunthalam, Telugu, Tollywood

సినిమా కు సంబంధించిన విషయాల పట్ల కొందరు అసంతృప్తి తో ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ నేపథ్యం లో సమంత కు లీగల్ చిక్కులు తప్పక పోవచ్చు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.ఆ చిక్కులు ఏంటి… సమంత నిజంగానే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక సమంత వేరే సినిమా ల విషయానికి వస్తే గుణశేఖర్ దర్శకత్వం లో శాకుంతలం అనే సినిమా ను సమంత చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యి చాలా రోజులైంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.

శాకుంతలం మాత్రమే కాకుండా హిందీ లో రెండు సినిమాలను మరియు ఒక వెబ్ సిరీస్ ని కూడా సమంత కమిట్ అయిందని వార్తలు వచ్చాయి.వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అంతే కాకుండా ఇటీవలే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా ను తెలుగు మరియు తమిళంలో చేసేందుకు కూడా సమంత ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి.దానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించబోతున్నాడట.

మొత్తానికి సమంత బిజీ బిజీగా ఉన్న సమయంలోనే ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అంటూ కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube