Lines on Chips : మీరు తినే చిప్స్ పై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా..

సినిమాలు చూసేటప్పుడు, పార్టీ చేసుకునేటప్పుడు, ఇంకా ఈవినింగ్ టైమ్‌లో ప్రజలు ఎక్కువగా స్నాక్స్ తింటుంటారు వీటిలో చిప్స్ అనేవి బాగా పాపులర్ అయ్యాయి.ఆల్రెడీ తయారు చేసిన చిప్స్ కొనుక్కోవడం, సాఫ్ట్ డ్రింక్ తాగుతూ వాటిని తింటూ ఎంజాయ్ చేయడం చాలామందికి అలవాటయింది.

 Why There Are Lines On Chips,potato Chips, Lays Chips, Bingo Chips, Lines On Chi-TeluguStop.com

అయితే ఈ చిప్స్ మన ఇంట్లో చేసినట్లు కాకుండా కొన్ని గీతలతో తయారుచేస్తారు.దీని వెనక ఒక పెద్ద కారణమే ఉంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మీరు బయట కొనుగోలు చేసే ప్యాకెడ్‌ చిప్స్ పై జిగ్‌జాగ్ డిజైన్‌లతో కూడిన లైన్లు కనిపిస్తాయి.

నిజానికి ఈ గీతలు లేదా లైన్ల కారణంగానే చిప్స్ కి రుచి అనేది దొరుకుతుంది.సాధారణంగా గీతలు కేవలం స్పైసీ చిప్స్ పైన మాత్రమే కనిపిస్తాయి.మిగతా చిప్స్‌పై గీతలు కనిపించవు.అందుకే అవి చప్పగా ఉంటాయి.

ఇక గీతలున్న వాటిలో మసాలా దినుసులు బాగా దట్టిస్తారు.ఆ మసాలా అనేది గీతల మధ్యలో చక్కగా ఒదిగిపోతుంది.

అప్పుడు వాటిని తింటున్నప్పుడు అమోఘమైన రుచి దొరుకుతుంది.ఒకవేళ ఎలాంటి గీతలు లేకపోతే మసాలా అనేది చిప్స్ కి సరిగా అంటుకోదు.

దీనివల్ల అవి ఒక ఒక దగ్గర చప్పగా అనిపిస్తాయి.మరో దగ్గర కాస్త రుచిగా అనిపిస్తాయి.

మొత్తంగా రుచి అసలు బాగోదు.

Telugu Bingo Chips, Chips, Lays Chips, Masala Chips, Potato Chips, Tasty Chips-L

లేస్‌, బింగో ఇంకా రకరకాల కంపెనీలు ఇప్పుడు ఇండియాలో పెద్ద ఎత్తున పొటాటో చిప్స్ తయారు చేస్తున్నాయి.వీటిలో చాలావరకు గీతలతోనే వస్తున్నాయి.క్రంచీగా, నాలుకకు తగలగానే వెరైటీ రుచి అందించేలా వీటిని తయారు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube