142 చీరలు మార్చి జయప్రద సాధించిన ఈ రికార్డ్ గురించి మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఒక వెలుగు వెలగడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని స్టార్ హీరోయిన్లుగా గుర్తింపును సంపాదించుకున్నారు.సీనియర్ నటీమణులలో ఒకరైన జయప్రద ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు.

 Heroinejaya Prada Rare Record Details Here Goes Viral In Social Media ,jaya Pra-TeluguStop.com

సీతారాములు సినిమా గురించి ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం.

దాసరి నారాయణరావు ఈ సినిమాకు డైరెక్టర్ కాగా రాము పాత్రలో కృష్ణంరాజు నటిస్తే సీత పాత్రలో జయప్రద నటించారు.

ఈ సినిమాకు మొదట కథే లేదని ఆ తర్వాత ఈ సినిమాకు అద్భుతమైన కథ సమకూరిందని ఆయన పేర్కొన్నారు.ఈ సినిమాలో జయప్రద గెటప్స్ వేర్వేరుగా ఉంటాయని ఇమంది రామారావు వెల్లడించారు.

ఈ సినిమా షూట్ 40 రోజులు జరిగిందని ఈ సినిమా కోసం జయప్రద 142 చీరలు మార్చారని ఆయన అన్నారు.

ఒక విధంగా ఇది రికార్డ్ అని ఆయన కామెంట్లు చేశారు.సీతారాములు సినిమా విడుదలైన తర్వాత రెండో వారం నుంచి కలెక్షన్లు వచ్చాయని ఇమంది రామారావు తెలిపారు.ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జయకృష్ణ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతకు మంచి లాభాలను అందించింది.ఈ సినిమాలోని తొలి సంధ్య వేళలో పాట అంచనాలకు మించి హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం జయప్రద ఎక్కువగా సినిమాలలో నటించడం లేదనే సంగతి తెలిసిందే.అన్ స్టాపబుల్ షోలో తాజాగా పాల్గొన్న జయప్రద ఈ షోలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జయప్రద వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జయప్రద ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.

జయప్రద రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube