కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్. బంగారు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరికెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.
ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అంతకుమించి కేజిఎఫ్ చాప్టర్ టు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సినిమా ఏడాది ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై సుమారు 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇలా ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టించడంతో దక్షిణాది సినిమా సత్తా ఏంటో మరోసారి ఈ సినిమా వసూళ్ల ద్వారా నిరూపించారు.ఇకపోతే థియేటర్లో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతూ అక్కడ కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది.త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాండడంతో అభిమానులు మరోసారి చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగస్టు 21వ తేదీ జీ తెలుగు ఛానల్ లో సాయంత్రం 5: 30 నిమిషాలకు ప్రసారం కానున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకుల సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
థియేటర్లోనూ,డిజిటల్ మీడియాలోనూ రికార్డులు సృష్టించిన ఈ సినిమా టీవీలో ఏ విధమైనటువంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.







