ఆ సీక్వెల్‌లో విజయ్ సేతుపతి వర్కౌట్ అయ్యేనా..?

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం ఎంతలా క్రేజీ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన మంచి అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ సినిమాలలో కూడా నటించాడు.నటుడిగానే కాకుండా నిర్మాతగా, ప్లే బ్యాక్ సింగర్ గా పేరు సంపాదించుకున్నాడు.

ఇక ఈయనకు ఓ సినిమా సీక్వెల్ వర్కౌట్ అవుతుందో లేదో చర్చగా మారింది.కేవలం చిన్న సినిమాతో, చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమయ్యాడు.

పిజ్జా సినిమాతో హీరోగా నటించిన ఈయనకు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.స్టార్ హీరోగా నిలిచాడు.

Advertisement

అంతే కాకుండా విలన్ పాత్రలో కూడా బాగా మెప్పించాడు.టాలీవుడ్ లో సైరా, ఉప్పెన సినిమాలో నెగెటివ్ రోల్ లో బాగా నటించాడు.

ఇక ప్రస్తుతం పలు అవకాశాలతో బాగా బిజీగా ఉన్నాడు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా ఎంత సక్సెస్ అందుకుందో చూసాం.ఇక ఈ సినిమా సీక్వెల్ రాక్షసుడు 2 గా తాజాగా ప్రకటించారు.ఇందులో బెల్లంకొండ కాకుండా మరో స్టార్ హీరోను ప్లాన్ చేస్తున్నారు.

అది కూడా విజయ్ సేతుపతి అని పేరు వినిపిస్తుంది.ఈ సినిమాను రెండు భాషలలో తెరకెక్కించడానికి ప్లాన్ చేయడం తో తమిళ స్టార్ హీరో అయితే మంచి క్రేజ్ ఉంటుందని టాక్.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

దీంతో విజయ్ సేతుపతిని ఆప్షన్ గా పెట్టుకున్నారు.కానీ ఇక్కడ అసలు సమస్య విజయ్ సేతుపతి తోనే వచ్చిందని తెలుస్తుంది.స్టార్ హీరో అయినా ఈయనకు సోలోగా తెలుగులో మార్కెట్ తక్కువ ఉందని, ఈయన పేరుతో హౌస్ ఫుల్ చేయడం కష్టమని అంటున్నారు.

Advertisement

పాజిటివ్ టాక్ తో తప్ప పికప్ ఉండదని, అలా అని సరైన ఆప్షన్ అని కూడా చెప్పలేమంటున్నారు.అంతేకాకుండా తమిళంలో రట్సాసన్ 2 గా విడుదల చేస్తేనే మంచి బిజినెస్ ఉంటుందని.

మొదట అక్కడ ఫస్ట్ పార్ట్ ఒప్పుకుంటేనే ఇక్కడ సాధ్యమవుతుందని.దీంతో ఈ విషయాన్ని విజయ్ సేతుపతి తో ఇప్పుడే ఫైనల్ చేయలేము అంటున్నారు.

తాజా వార్తలు