కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్(Vijay) తళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే విజయ్ కుమారుడు సంజయ్(Sanjay) కి దర్శకత్వంపై ఎంతో ఆసక్తి ఉండడంతో ఇప్పటికే ఈయన విదేశాలలో దర్శకత్వానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా తీసుకుంటున్నారు.త్వరలోనే ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

విజయ్ వారసుడు సంజయ్ దర్శకుడిగా కాకుండా ఆయనని హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని ఓ కోలీవుడ్ నిర్మాత గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఇందులో భాగంగా ఇప్పటికే విజయ్ తో కలిసి ఈ విషయం గురించి చర్చించారని తెలుస్తోంది.తెలుగులో బుచ్చిబాబు(Bucchi Babu) దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన(Uppena) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమాకు మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
అలాగే కృతి శెట్టి(Kriti Shetty) కూడా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా తెలుగులో సూపర్ హిట్ అందుకున్నటువంటి ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ రీమేక్ సినిమాలో విజయ్ వారసుడు సంజయ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.ఇక ఈ రీమేక్ చిత్రంలో కృతి శెట్టినే హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట.దర్శకత్వంపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి సంజయ్ ఇలా ఉప్పెన రీమేక్(Uppena Remake) సినిమాలో హీరోగా నటించడానికి ఒప్పుకుంటారా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే ఈ సినిమా విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొద్ది రోజులలోనే ఈ సినిమా గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక కృతి శెట్టి ఇదివరకే ది వారియర్ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
త్వరలోనే నాగచైతన్యతో నటించిన కస్టడీ సినిమా ద్వారా మరోసారి తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.







