సునిశిత్ నిజంగానే వన్ సినిమా లో నటించాడట... ఇదిగో ప్రూఫ్...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు తదితరుల కాంబినేషన్ లో తెరకెక్కిన వన్ "నేనొక్కడినే" అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రం హాలీవుడ్ తరహాలో తెరకెక్కించడంతో మాస్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించగా నాజర్, శియాజీ షిండే, నవీన్ పోలిశెట్టి, ప్రదీప్ రావత్, కెల్లీ దోర్జీ, పోసాని కృష్ణ మురళి, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ మధ్యకాలంలో సునిశిత్ అనే వ్యక్తి మొదటగా "నేనొక్కడినే" చిత్రంలో హీరోగా నటించే అవకాశం తనకే వచ్చిందని అంతేకాకుండా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల షూటింగులో కూడా తాను పాల్గొన్నానని సునిశిత్ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ చిత్ర కథ ప్రిన్స్ మహేష్ బాబుకి బాగా నచ్చడంతో తనకి దాదాపుగా 50 లక్షల రూపాయలు ముట్టజెప్పి తనని ఆ సినిమా నుంచి తప్పించారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు.దీంతో ఈ మాటలు విన్న మహేష్ బాబు అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు.

మరికొందరైతే సునిశిత్   ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.దీంతో తాజాగా సునిశిత్  తాను వన్ - నేనొక్కడినే చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో తీసిన ఓ స్టిల్ ని తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశాడు.

Advertisement

అంతే కాకుండా ఈ ఫోటోకి "వన్ నేనొక్కడినే మూవీ షూటింగ్ మెమోరీస్" క్యాప్షన్ కూడా పెట్టాడు.అయితే ఈ స్టిల్ లో కృతి సనన్ స్కూటీపై వస్తుండగా హీరో సునిశిత్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటాడు.

దీంతో మరోమారు సునిశిత్ సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారాడు.అలాగే మహేష్ బాబు అభిమానులు ఈ స్టిల్ పై స్పందిస్తూ ఇలాంటి "అమీర్ పేట ఎడిటింగులు" మేము చాలా చూసామంటూ వ్యంగంగా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య ఒకప్పటి ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సునిశిత్  పాల్గొన్నాడు.ఈ ఇంటర్వ్యూ లో భాగంగా సునిశిత్ వన్ సినిమా నుంచి తప్పుకున్నందుకు తనకి మహేష్ బాబు 50 లక్షల రూపాయలు ముట్ట చెప్పినట్లు కూడా పలు వ్యాఖ్యలు చేశాడు.

అలాగే తాను ఇటీవలె బెంజ్ కారు ని కొన్నానని, కానీ కొన్న మూడు రోజులకే దుండగులు తన బెంజ్ కారు ని అపహరించారని కూడా చెప్పుకొచ్చాడు.దీంతో మీమ పేజ్ క్రియేటర్స్ హీరో  సునిశిత్  ని తెగ ట్రోల్స్  చేస్తున్నారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు