ఇంకా ఎన్నాళ్లు బాయ్స్‌, బొమ్మరిల్లు పేర్లు చెప్తావు సిద్దు..?

బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ ( Sidharth )మళ్లీ తెలుగు లో సందడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

నాలుగు అయిదు సంవత్సరాల గ్యాప్ తర్వాత మహా సముద్రం సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన సిద్దుకు నిరాశ మిగిలింది.

ఆ తర్వాత వచ్చిన టక్కర్ సినిమా కూడా నిరాశ నే మిగిల్చింది.సిద్దు తో పాటు ఆయన అభిమానులు కూడా ఒక సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

తమిళ్ తో సిద్దు చిత్తా( Chitta ) అనే సినిమా ను స్వయంగా నిర్మించి హీరోగా నటించాడు.తానే నిర్మాత అవ్వడం వల్ల కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ను విడుదల చేసేందుకు గాను తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న సిద్దుకు తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ స్థానం దక్కడం లేదు.సిద్దు సినిమా లను ఇప్పుడు ఎవరు చూస్తారు అంటూ థియేటర్లు ఇవ్వడం లేదట.సలార్‌ తో కలిసి వద్దాం అనుకున్నాం.

Advertisement

ఆ సినిమా తప్పుకోవడంతో పది సినిమాలు అదే తేదీకి వస్తున్నాయి.దాంతో అన్ని సినిమా లకు థియేటర్లు లభిస్తున్నాయి కానీ నా సినిమా కి మాత్రం థియేటర్లు లేవు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

బాయ్స్ సినిమా విడుదల అయ్యి 20 ఏళ్లు అవుతుంది.

బొమ్మరిల్లు సినిమా ( Bommarillu movie )తో నేను ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నానో అందరికి తెలుసు అంటూ ఇంకా ఆ సినిమా లను జ్ఞాపకం తెస్తూ ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు.ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను అంటూ గొప్పగా చెప్పుకునేందుకు బాయ్స్ ఉపయోగపడుతుంది.అయితే ఆ స్థాయి విజయాన్ని, ఆ స్థాయి పాత్రని ఎందుకు చేయలేక పోతున్నావు అంటూ సిద్దు ని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఆ సినిమా ల పేర్లు చెప్పకుండా ఈ సినిమా గురించి చెబుతూ సినిమా కి థియేటర్లు పొందలేవా అంటూ కొందరు విమర్శిస్తున్నా.మొత్తానికి సిద్దార్థ్‌ కెరీర్ విషయం లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

అందుకే అసహనంతో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు