లవ్ స్టోరీ సినిమాలతో విసిగిపోతున్నాను.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు సిద్ధార్థ్( Siddharth ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలలో నటించి లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ తాజాగా టక్కర్ ( Takker ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Tired Of Love Story Movies, Siddharth, Love Story Movies, Bommarillu, Takker-TeluguStop.com

ఈ సినిమా జూన్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ క్రమంలోని ఈయన తెలుగులో కూడా భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu Bommarillu, Love Story, Siddharth, Takker-Movie

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ హీరో ప్రేమ కథ సినిమాల ( Love Story Movies ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను కెరియర్ మొదటి నుంచి ప్రేమ కథ సినిమాలలో నటిస్తూ వచ్చానని అయితే ఈ చిత్రాలలో నటించి విసిగిపోయాను అంటూ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రేమకథ అనేది భావోద్వేగంతో కూడిన, అలసిపోయే ప్రయాణం.

ఒక్కసారి లవ్ స్టోరీలు చేస్తే ఆ జోనర్‌లోనే కొనసాగాలని ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం అందరిలోనూ ఉందని ఈయన తెలియజేశారు.అయితే ప్రస్తుతం నేను ఒక సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ కనుక చేస్తే రాబోయే దశాబ్ద కాలం వరకు అలాంటి లవ్ స్టోరీ చిత్రాలలోనే నటించాల్సి ఉంటుందని తెలిపారు.

Telugu Bommarillu, Love Story, Siddharth, Takker-Movie

ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీ సినిమాలలో చేసి తాను విసిగిపోయానని అందుకే ఇకపై ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలలో తాను నటించనని సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన నటిస్తున్నటువంటి టక్కర్ సినిమా లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంటూ ఈయన కామెంట్స్ చేశారు.ఇక బొమ్మరిల్లు( Bommarillu ) సీక్వెల్ గురించి కూడా ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ… బొమ్మరిల్లు సినిమాకు నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలియజేశారు.

బొమ్మరిల్లు మ్యాజిక్‌ని సీక్వెల్‌లో పునఃసృష్టి చేయడం చాలా కష్టమైన పని అంటూ సిద్ధార్థ్‌ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube