అల స్ట్రాటజీనే 'గుంటూరు కారం' కోసం వాడుతున్న గురూజీ.. ఇది సూపర్ హిట్టేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ”గుంటూరు కారం”.( Guntur Karam ) ఈ మాస్ కమర్షియల్ సినిమాకు ముందు నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Ala Vaikunthapurramuloo Strategy For Mahesh Babu Guntur Karam Details, Guntur Ka-TeluguStop.com

ఈ మూవీపై సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇటీవలే ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.

ఈ మాస్ టీజర్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు డబల్ చేసాయి.ఇదిలా ఉండగా ఈ సినిమాకు గురూజీ అల వైకుంఠపురములో( Ala Vaikunthapurramuloo ) స్ట్రాటజీని వాడుతున్నారు అని టాక్ వస్తుంది.

ఈ సినిమా ముందుగా మ్యూజికల్ హిట్ అయిన విషయం తెలిసిందే.మూడు నెలల ముందుగానే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక్కో సాంగ్ రిలీజ్ చేస్తూ వచ్చారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Maheshbabu, Pooja Hegde, Sreeleela, Trivikram

దీంతో అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ కాకుండానే 50 శాతం మ్యూజిక్ వల్లనే హిట్ అయ్యింది.రిలీజ్ తర్వాత సినిమా కూడా ఆకట్టు కోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇప్పుడు గురూజీ ఇదే స్ట్రాటజీని ఉపయోగించి ముందుగానే సాంగ్స్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.అందులోను ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వడంతో మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అనే విషయం తెలిసిందే.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Maheshbabu, Pooja Hegde, Sreeleela, Trivikram

అందుకే గుంటూరు కారం నుండి కూడా రెండు మూడు నెలల ముందుగానే సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారట.ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేసారని అంటున్నారు.దీంతో ఈ వార్త విని సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube