క్లీంకార ఎవరి పోలికో రివీల్ చేసిన సాయిధరమ్ తేజ్.. కళ్లు అలా ఉంటాయంటూ?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సాయిధరమ్ తేజ్( Sai Dharam Tej ) విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకోగా బ్రో సినిమాతో సాయితేజ్ కు అంతకు మించిన హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి నటించడం వల్లే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం.

తాజాగా సాయితేజ్ క్లీంకార ఎవరి పోలికో రివీల్ చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

క్లీంకార( Klin Kaara )కు సంబంధించిన ఫోటోలు ఇప్పటివరకు రివీల్ కాలేదనే సంగతి తెలిసిందే.క్లీంకారకు సంబంధించిన ఫోటోల కొరకు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ ఉపాసన త్వరలో క్లీంకార ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

మెగా ప్రిన్సెస్ అంటూ క్లీంకార గురించి నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

క్లీంకారకు రామ్ చరణ్( Ram charan ) పోలికలు వచ్చాయని సాయిధరమ్ తేజ్ అన్నారు.రామ్ చరణ్ ఎలా ఉంటారో క్లీంకార సైతం అలానే ఉందని ఆయన కామెంట్లు చేశారు.క్లీంకార కళ్లు చాలా బాగున్నాయని క్లీంకార కళ్లు ఎంతగానో నచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

కూతురు తండ్రి పోలికలతో పుడితే లక్కీ అని చాలామంది చెబుతుంటారని క్లీంకార విషయంలో సైతం అదే జరిగిందని సాయితేజ్ అన్నారు.బ్రో సినిమా( BRO movie ) ప్రమోషన్స్ లో భాగంగా సాయితేజ్ రివీల్ చేస్తున్న విషయాలు ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చేస్తున్నాయి.

సాయితేజ్ వరుస విజయాలతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బ్రో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సాయితేజ్ బ్రో సినిమా కోసం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకున్నారని భోగట్టా.

ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు